ధనుష్-ఐశ్వర్య నిజంగా విడిపోవడం లేదా. ఇదే నిజమైతే రజినీకాంత్ అభిమానుల నెత్తిన పాలుపోసినట్లే. ధనుష్-ఐశ్వర్య లు 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు పలకాలనుకున్నారు. దాని కొరకు చెన్నై ఫ్యామిలీ కోర్టు లో విడాకుల కోసం పిటిషన్ కూడా వేశారు. దానితో అందరూ షాకయ్యారు.
ధనుష్-ఐశ్వర్య విడిపోతున్నామనగానే రజినీకాంత్ ఫ్యామిలీ ఎలా ఫీలయ్యిందో తెలియదు కానీ.. సూపర్ స్టార్ అభిమానులు, ధనుష్ ఫ్యాన్స్ అంతా చాలా ఫీలయ్యారు. వారిరువురు కలిసి ఉండాలని చాలా కోరుకున్నారు. కానీ ధనుష్-ఐశ్వర్యల మద్యన విభేదాలు తారాస్థాయిలో ఉండడంతో వాళ్ళు విడాకుల వైపే మొగ్గు చూపారు.
అయితే ఫ్యామిలీ కోర్టులో విడాకుల విచారణ జరుగుతున్నప్పటికీ.. ఈ జంట కోర్టుకు హాజరవడం లేదు, అక్టోబర్ 6న ఈ కేసు విచారణ జరిగింది. ధనుష్ గానీ, ఐశ్వర్య గానీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆ విచారణను అక్టోబర్ 19కి వాయిదా పడింది. ఇప్పుడు జరిగిన రెండో విచారణకు కూడా ఈ ఇద్దరిలో ఒక్కరు కూడా హాజరు కాలేదు.
దానితో ధనుష్-ఐశ్వర్య లు రజినీకాంత్ కోసం కలిసిపోయారా.. ఆయన ఆరోగ్యం దృష్యా ధనుష్ - ఐశ్వర్యలు మనసు మార్చుకుని కలిసిపోవాలని ఫిక్స్ అయ్యి కోర్టుకు హాజరవడం లేదా అనే ఆనందంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు.