2024 ఎలెక్షన్ ముందు రోజా ను దేవతలా పూజించిన జబర్దస్త్ కమెడియన్స్ కొంతమంది ఎలక్షన్స్ సమయం నుంచి రోజాపై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. రోజా కూడా కమెడియన్స్ ను అనకూడని మాటలని రెచ్చగొట్టడంతో వారు కూడా రోజా పై ఫైర్ అయిన సందర్భాలు ఉన్నా, అది ఎలెక్షన్ వరకే అని కొంతమంది సైలెంట్ అయ్యారు. ఆర్పీ లాంటి వాళ్ళు మాత్రం తరచూ రోజా పై ఒంటికాలిపై విరుచుకుపడుతూ.. పనిగట్టుకుని రోజాను టార్గెట్ చేస్తున్నారు.
ఆమె ద్వారా లాభం పొందినా పొందకపోయినా.. ఆమెను అమ్మగా భావించి దీవెనలందుకున్న ఆర్పీ ఇప్పుడు రోజా పై మరింత గా రెచ్చిపోవడం అనేది రోజా ను సపోర్ట్ చేసే రాజేష్ లాంటి వాళ్లకు నచ్చడం లేదు. రాకింగ్ రాకేష్ చేసిన కెసిఆర్ మూవీ విడుదల ప్రమోషన్స్ లో రోజా పై నెగెటివ్ గా మాట్లాడే వాళ్లపై రాకేష్ ఇండైరెక్ట్ గా పంచ్ వేసాడు.
మా ఇంటికి పిలిస్తే రోజమ్మ రాజకీయాలు బయటే వదిలేస్తారు, గడపలోపలికి కాలుపెట్టాక ఆమెకు ఏ పార్టీ తో సంబంధం ఉండదు. నేను ఇబ్బందుల్లో ఉన్నాను అంటే కొందరిని మాత్రమే డబ్బులు అడగగలను, అడగకుండానే నేను తీసుకునే వారిలో రోజా కూడా ఒకరు. ఎవరెవ్వరో ఏదో మాట్లాడతారు. రోజా ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఈరోజున ఆమె గురించి మాట్లాడుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేద్దమంటూ రాకేష్ ఇండైరెక్ట్ గా ఆర్పీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఆర్పీ బిజినెస్ మొదలు పెట్టినప్పుడు రోజా వెళ్లి ఆర్పీ ఆయన భార్య లక్కీని ఆశీర్వదించి వచ్చింది. అలాగే రోజా పై ఆర్పీ కూడా అంతే ప్రేమ చూపించేవాడు. కానీ పాలిటిక్స్ లో రోజా పై ఆర్పీ తరచూ విరుచుకుపడడంతో రోజాను అభిమానించేవాళ్లకు అది నచ్చడం లేదు.