సీఎంగా పవన్ కళ్యాణ్.. డిప్యూటీగా లోకేష్!!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్.. మంత్రిగా ఉన్న నారా లోకేష్ లకు ప్రమోషన్ వస్తోంది..! ఇప్పుడిదే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. ఇప్పుడే ఎందుకు ఈ హడావుడి.. ఒక వర్గం మీడియా ఎందుకిలా రాద్దాంతం చేస్తోంది..?. ఇదేంటి ఇద్దరూ ఇద్దరైతే ఇక సీఎం చంద్రబాబు సంగతేంటి..? ఆయన ఏం చేయాలి..? అనే కదా మీ సందేహం.. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రత్యేక కథనం చదివితే మీకున్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది..
ఇదీ అసలు సంగతి..!
గత కొన్ని రోజులుగా పవన్ సీఎం కాబోతున్నారు.. లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారు అని ఒక వర్గం మీడియా.. సోషల్ మీడియాలో కొందరు రచ్చ రచ్చే చేస్తున్నారు. ఐతే.. ఇక్కడ సీఎం అనగానే పవన్.. చీఫ్ మినిస్టర్ (ముఖ్యమంత్రి) అవుతున్నారని అనుకుంటారేమో అది కాదండోయ్.. CM అంటే సెంట్రల్ మినిస్టర్ అని అర్థమట. ఇక పవన్ ఉన్న హోదాలో డిప్యూటీగా నారా లోకేష్ కాబోతున్నారట. చూశారుగా.. ఇదీ సీఎం.. డిప్యూటీ అంటే అర్థమట. అటు టీడీపీ శ్రేణులు.. ఇటు జనసేన శ్రేణులు గట్టిగానే హడావుడి చేస్తున్నాయి.. ఇక పవన్ అంటే పడని వైసీపీ కార్యకర్తలు కూడా గట్టిగానే సెటైర్లు వేస్తున్న పరిస్థితి.
పవన్ ఎందుకో..?
ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం.. బీజేపీలో జనసేన విలీనం కాబోతోందట. ఈ ప్రక్రియ తర్వాత పవన్.. కేంద్ర మంత్రి కాబోతున్నారట. ఇక సౌత్ ఇండియాలో బీజేపీ మొత్తాన్ని సేనాని నడిపించాలని పెద్ద బాధ్యతే కేంద్రంలోని కమలనాథులు అప్పగించబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే.. పవన్ స్థానంలో చినబాబు లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ హిందూ, సనాతన ధర్మం అంటూ మొదలు పెట్టారనే రచ్చ సైతం నడుస్తోంది. ఇది ఎంత వరకూ నిజమో..? కొన్ని మీడియా సంస్థలు ఎందుకిలా హడావుడి చేస్తున్నాయో..? ఎందుకు ఈ రచ్చ జరుగుతోందో..? టీడీపీ, జనసేన పార్టీలకే ఈ పరిస్థితి..? లేనిపోని రాద్దాంతాలు ఎందుకు..? అనేది విమర్శకులకు.. ఆ మీడియా సంస్థలకే తెలియాలి. కనీసం ఇంత హడావుడి జరుగుతుంటే అటు పవన్ కానీ.. ఇటు లోకేష్ నుంచి కానీ కనీసం రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇదే జరిగితే..!
ఐతే.. ఒకవేళ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి ఐతే టూ వీలర్ బైక్స్, కార్లు మీద రాపించిన డిప్యూటీ సీఎం అని సైనిక్స్ ఏం చేస్తారు..? అని వైసీపీ ఒకింత హేళన చేస్తూ ఉండగా.. ఐతే DCM లో D తీసేసి.. సీఎం మంత్రమే పెట్టుకుని.. CM ని సెంట్రల్ మినిస్టర్ అని మార్చుకుంటే సరిపోతుంది కదా అని జనసేన కౌంటర్ ఎటాక్ చేస్తోంది.. దీంతో ఈ వ్యవహారం కాస్త పవన్ ఫ్యాన్స్, కార్యకర్తలు.. వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానుల మధ్య మాటల యుద్ధం, కౌంటర్లు పేల్చుకుంటున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ అయ్యింది. మరి సీఎం.. డిప్యూటీ అంటూ వస్తున్న వార్తలు నిజం అవుతాయో.. లేదంటే పుకార్లుగానే మిగిలిపోతాయో అనేది చూడాలి మరి.