సౌత్ లో కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ టాక్సిక్ లో నటించాల్సిన బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంటర్ అయ్యింది. అసలు కరీనా కు యష్ టాక్సిక్ మూవీ ఫస్ట్ సౌత్ మూవీ అవుతుంది అనుకున్నారు ఆమె అభిమానులు. కానీ ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
ఇక కరీనా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ లో నటించనుంది, దర్శకుడు సందీప్ వంగ కరీనా కపూర్ ను ప్రభాస్ స్పిరిట్ కోసం ఎంపిక చేసారు అనే టాక్ వినిపించడం కాదు.. ఈ ప్రాజెక్ట్ కోసం కరీనా కపూర్ ఏకంగా 12కోట్ల పారితోషికం కూడా అందుకొంటుంది అంటూ న్యూస్ చక్కర్లు కొట్టింది. ఈ విషయమై సందీప్ వంగ కానీ, కరీనా కానీ ఎక్కడా స్పందించలేదు.
తాజాగా కరీనా కపూర్ స్పిరిట్ విషయమై క్లారిటీ ఇచ్చింది. సౌత్ సినిమాల్లో నటించాలని ఉంది, నాకు తగ్గ పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తాను. ఆ చిత్రంలో నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అప్పుడే నాకు ఆ పాత్ర దగ్గర అవుతుంది. ప్రభాస్ స్పిరిట్ లో నటిస్తున్నానే వార్తలు చూసాను, స్పిరిట్ లో ఒకవేళ నాకు అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను.
అయితే ఇప్పటివరకూ స్పిరిట్ లో నటించమని నన్నెవరూ సంప్రదించలేదు, దానికి సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు అంటూ స్పిరిట్ లో తాను నటిస్తున్నాను అని వస్తున్న వార్తలకు కరీనా కపూర్ క్లారిటీ ఇచ్చింది.