బాలీవుడ్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ హృతిక్ రోషన్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కిస్తున్న వార్ 2 షూటింగ్ కోసం నిన్న శనివారమే ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళారు. అక్కడ స్పెషల్ సెట్ ఓ జరుగుతున్న వార్ 2 షూటింగ్ లో ఈరోజు నుంచి ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు.
అయితే ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్ లో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ల పై ఓ భారీ ఛేజింగ్ సీన్ ను షూట్ చేయడానికి అయాన్ ముఖర్జీ సన్నాహాలు చేస్తోన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఛేజింగ్ సీక్వెన్స్ లో హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ లతో పాటుగా ఈ చిత్రంలో నటిస్తున్న కీలక నటులు పాల్గొంటారని సమాచారం.
దేవర తో సక్సెస్ కొట్టి వార్ 2 కొత్త షెడ్యూల్ లో పాల్గొన ఎన్టీఆర్ విషయంలో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి గా వున్నారు. ఇక వార్ 2 చిత్రంలో హృతిక్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.