పవన్ వారసుడు అకీరా నందన్ రాక కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. అకీరా అసలు హీరో అవుతాడా, లేదా అనేది క్లారిటీ లేకపోయినా.. పవన్ ఫ్యాన్స్ మాత్రం అకీరా హీరో గా ఎంట్రీ ఇచ్చే క్షణం కోసం వెయిటింగ్. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల సమయంలో గెలవడంతో ఆ గెలుపును తన కొడుకు అకీరా తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు ఆ సమయంలో ప్రతి చిన్న విషయంలో అకీరా ను పవన్ హైలెట్ చేసారు.
అయితే అప్పటినుంచి సైలెంట్ గా ఉన్న అకీరా సినీ ఎంట్రీ విషయమై ఇప్పుడు మరోసారి హైలెట్ అయ్యింది. అకీరా నందన్ పవన్ కళ్యాణ్ OG లో స్పెషల్ కేరెక్టర్ లో కనిపించబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
అయితే అకీరా నందన్ OG లో గెస్ట్ రోల్ కనిపిస్తున్నాడనే వార్త అంతా ఫేక్ అంటున్నారు. అకీరా పవన్ సినిమాలో నటించడం లేదు అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా OG రెస్యూమ్ షూట్ కోసం రెడీ అవుతున్నారు. అందుకే OG లో అకీరా కనిపిస్తాడని న్యూస్ తెగ వైరల్ అయ్యింది.