కర్లీ హెయిర్ తో కత్తిలా మారిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు లిల్లిగా నెగెటివ్ పాత్రతో అందరి మదిలో గుర్తుండిపోయేలా హైలెట్ అయ్యింది. సిద్దు జొన్నలగడ్డతో కలిసి అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ గానే కాదు, అదిరిపోయే నటనతో టిల్లు స్క్వేర్ లో అదరగొట్టేసింది. దానితో అనుపమ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇపుడు పలు ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా మారిపోయింది. అయినప్పటికి సోషల్ మీడియా లో తరచూ గ్లామర్ ఫోటో షూట్స్ ను షేర్ చేసే అనుపమ పరమేశ్వరన్ తాజాగా పోస్ట్ చేసిన పిక్ చూస్తే అబ్బో కర్లీ హెయిర్ తో కత్తిలా ఉంది అంటారేమో..
కర్లీ హెయిర్ చూపిస్తూ నీరెండలో అనుపమ పరమేశ్వరన్ అందాలు మరింతగా ద్విగుణీకృతమయ్యాయి. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ న్యూ లుక్ నెట్టింట వైరల్ గా మారింది.