నాగ చైతన్య అతి త్వరలోనే హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆగష్టు 8న శోభిత తో నిశ్చితార్ధం చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం తన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పెళ్లి కి కాస్త సమయం తీసుకున్న చైతు-శోభిత లు ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ గా ఉన్నారు.
కాబోయే భార్య శోభితతో నాగచైతన్య చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ లిఫ్ట్‌లో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లి కి ఇంకాస్త సమయం ఉండడంతో చైతు-శోభిత లు ఇలా షికార్లు చేస్తూ అభిమానులను అలరించారు.
ఇక నాగ చైతన్య తండేల్ మూవీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉంటే.. అటు శోభిత దూళిపాళ్ల తన ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది. సో వీళ్ళిద్దరూ ఇలా కనిపించగానే చైతు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావ్ అంటూ అభిమానులు అడుగుతున్నారు.