బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం వైల్డ్ కార్డు ఎంట్రీస్, ఓల్డ్ కంటెస్టెంట్స్ మద్యన గేమ్ అంతా చప్పగా సాగుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఎంతో ఎక్స్ పీరియన్స్ తో కనిపిస్తారనుకుంటే.. వాళ్ళు కూడా గేమ్ లో అంత యాక్టీవ్ గా కనిపించడం లేదు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో నిఖిల్, నబీల్ నువ్వా-నేనా అని ఓట్లు కొల్లగొట్టారు.
ఆ తర్వాత ప్రేరణ, యష్మి లకు కూడా ఓట్లు బాగానే పడ్డాయి. ఇక నాగమణికంఠ కూడా ఓటింగ్ లో మంచి స్థానంలోనే కొనసాగాడు. గౌతమ్, పృథ్వీలు కూడా అటు ఇటుగా ఓటింగ్ లో పోటీపడ్డారు. ఇక చివరిగా డేంజర్ జోన్ లోకి వచ్చేసరికి వైల్డ్ కార్డు ఎంట్రీస్ లో వచ్చిన హరితేజ, టేస్టీ తేజాలు చివరి స్థానాల్లో ఉన్నారు. వీరిలో ఎవరొకరు ఎలిమినేట్ అవుతారనుకున్నారు.
కానీ ఈ వారం షాకింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం ఆడియన్స్ కు షాకిచ్చింది. అదే ఈ వారం నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యాడు అని తెలుస్తోంది. నా ప్రియా కోసం వచ్చాను. నేను బిగ్ బాస్ కప్ గెలవాలి, నా ప్రియను గెలవాలి, నా అత్తమామల నుంచి గౌరవం పొందాలి అని చెప్పిన నాగమణికంఠ ఏడో వారంలోనే ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడాడా..
శనివారం ఎపిసోడ్ లో నా వల్ల కావడం లేదు, నేను ఆడలేకపోతున్నన్నా, వెళ్ళిపోతాను అని నాగ్ ను అడిగినట్లుగా మణికంఠ హౌస్ నుంచి వెళ్లిపోయాడా, లేదా అనేది తెలియాల్సి ఉంది.