అవును.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. పవర్‌లో ఉన్నాం కదా అని ఎగిరెగిరి పడితే.. పవర్ కోల్పోయిన తర్వాత బతుకు బస్టాండే..! ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం తలకిందులు ఐపోతుంది అంతే. గతంలో ఎంతో మంది ఇలా ఎగిరెగిరి అడ్రెస్స్ లేకుండా పోయిన వారు ఎంతో మందిని మనం కళ్ళారా చూసే ఉంటాం. ఇప్పుడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కూడా అదే కోవకు చెందిన వాడే..! వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబోయ్.. ఈయన చేసిన హడావుడి.. అంతకు మించి పచ్చి బూతులు, సవాళ్లు, దాడులు ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయ్. సీన్ కట్ చేస్తే.. వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు బోరుగడ్డ తాట తీస్తోంది సర్కార్.
ఇదేంటి జగన్..!
వైసీపీ హయాంలో నోటికొచ్చినట్టు మాటలు.. ఇష్టానుసారం వ్యవహారం నడిపిన అనిల్ బొరుగడ్డకు ఇప్పుడే క్లారిటీ వచ్చినట్టుంది. మొన్నటి వరకూ చంపేస్తా.. నరికేస్తా అని ఎగిరిన ఈ తోపు.. ఇప్పుడు పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుని కుయ్యో మొర్రో అని వేడుకుంటున్నాడు. దీనికి తోడు.. వైసీపీ నేతలు ప్రోత్సహిస్తేనే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ను, టీడీపీ నేతలను తిట్టానని పూసగుచ్చినట్టుగా పోలీసు విచారణలో చెప్పాడు. ఐతే.. పార్టీ కోసం ఇంత చేస్తే కనీసం పార్టీ నేతలు పరామర్శించేందుకు ఒక్కరంటే ఒక్కరూ కూడా రావడంలేదని బాధ పడుతున్నాడట. అంతేకాదు.. ఇదిగో పలానా మోపిదేవి వెంకటరమణ, పేర్ని నాని ఇంకా కొందరు చెప్పడంతోనే ఇలా రెచ్చిపోయి మరీ ప్రవర్తించినట్టు పోలీసులకు చెప్పాడు. చూశారా.. ఇక్కడ ఒక్కరంటే ఒక్కరూ వైసీపీ నుంచి పట్టించుకోకపోవడం, కనీసం లీగల్ సపోర్టు కూడా ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే వైసీపీ యూజ్ అండ్ త్రో.. అని అర్థం చేసుకోవచ్చు. కనీసం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పట్టించుకోలేదు.
కాళ్ళు పట్టుకుంటా..!
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ అరెస్ట్, వైసీపీ స్పందించకపోవడంపై తెలుగు తమ్ముళ్లు, టీడీపీ శ్రేణులు తిట్టి పోస్తున్నారు. బోరుబావి.. ఎంత ఎగిరి పడ్డావు కదా.. ఇప్పుడు ఏమైంది..? తమరికోసం వచ్చేది ఎవరు..? కనీసం పట్టించుకునే దిక్కే లేకుండా పోవడం లేదు కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి.. ఇంటూరి రవికిరణ్ అనే పొలిటికల్ పంచ్ పేజీని మెయింటెయిన్ చేసే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే.. వియ్ స్టాండ్ పోస్టర్లు వేసి మరీ రచ్చ చేసింది వైసీపీ.. పేర్ని నాని దగ్గరుండి మరీ బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు. ఐతే.. ఇతను వైసీపీ కోసం పని చేసిన వ్యక్తే.. బోరుగడ్డ కూడా అంతే. ఐనా సరే.. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఎవరో తెలియదన్నట్లుగా వైసీపీ వ్యవహరించడం గమనార్హం. జగన్ రెడ్డి కాదు కదా కనీసం కార్యకర్తలు కూడా అసలు బోరుగడ్డ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేరంటే సీన్ అర్థమైంది కదూ. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టుగా వైసీపీ కూడా బోరుగడ్డను వాడినన్ని రోజులు వాడుకుని.. ఇప్పుడు అరెస్ట్ అయ్యేసరికి ముఖం చాటేసింది.
పోలీసులు ఇలా..!
ఈ అరెస్టు వ్యవహారంపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. అనిల్ బొరుగడ్డను అరెస్టు చేశాం. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపుతున్నాం. 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పట్టికే ఇతనిపై 17కేసులు ఉన్నాయి. 15 కేసులు ఆక్టివ్ లో ఉన్నాయి. 2021లో 50 లక్షల డిమాండ్ చేసి కత్తి చూపి బెదిరించిన కేసులో అరెస్టు చేశాం. 2019లో అరండల్ పేట పోలీస్ స్టేషనులో పోలీసులు రౌడి షీట్ ఓపెన్ చేశారు. కేవలం గుంటూరులోనే 8 కేసులు నమోదై ఉన్నాయి. 4 కేసులు విచారణ* ప్రక్రియలో ఉన్నాయి. 4 కేసులలో పిటి వారెంట్ ఇవ్వడం జరిగింది. అందుకే.. సోషల్ మీడియాలో ఇతను బాగా చురుకుగా ఉండేవాడు. రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు. సోషల్ మీడియాను అందరూ జాగ్రత్తగా వాడుకోవాలని హెచ్చరించారు. ఇదిగో.. ఇలానే ఉంటుంది ఎగిరెగిరి పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.