బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే ఏడు వారాలు పూర్తయ్యి ఎనిమిదో వారం లోకి ఎంటర్ కాబోతుంది. ఈ వారం కొత్త క్లాన్ చీఫ్ గా గౌతమ్ కృష్ణ పోరాడి ఎన్నికయ్యాడు. అయితే ఈవారం మొత్తంలో ఎవరు బెస్ట్ గేమ్ ఇచ్చారు, ఎవరు చెత్త గేమ్ ఆడారో అనే విషయంలో నాగార్జున క్లాస్ రెడీ అయ్యింది. ఈ రోజు శనివారం.. అంటే నాగార్జున కంటెస్టెంట్స్ కు స్పెషల్ క్లాస్ ఇచ్చే రోజు.
ఈవారం ఎపిసోడ్ ప్రోమో వదిలారు. మరి ఏయే కంటెస్టెంట్స్ నాగార్జున చేతిలో తిట్లు తిన్నారనే విషయంలో ప్రోమోలో అంతగా చూపించలేదు. కేవలం బ్రెయిన్ ఉపయోగించకుండా గేమ్ ఆడిన నిఖిల్ కి, అలాగే ఆగ్రహంతో మైక్ విసిరేసిన గౌతంకృష్ణలను నాగార్జున మీకు బుర్ర, బుద్ది లేకుండా గేమ్ ఆడేస్తున్నారంటూ క్లాస్ పీకారు.
ఇక 50 వేల కోసం అవినాష్ తన హెయిర్ ని, మీసాన్ని తీయించుకోవడం పై నాగార్జున అవినాష్ ను అప్రిషేట్ చేసారు. పృథ్వీ నీ గెడ్డం తీయించుకుంటే 5 లక్షలు ప్రైజ్ మనీ కి యాడ్ అవుతాయని నాగ్ చెప్పగా ఏంటి సర్ నా గెడ్డాన్ని టార్గెట్ చేసారు అంటూ పృథ్వీ అన్నాడు.
పృథ్వీ ఫైనల్ గా నీ గెడ్డం తీస్తే మూడు వారాల పాటు ఇమ్యూనిటీ పొంది నామినేట్ అవ్వవు, డైరెక్ట్ గా 10 వ వారంలోకి ఎంటర్ అవుతావంటూ నాగ్ ఆఫర్ ఇచ్చారు. మరి పృథ్వీ ఆలోచించుకుంటున్న ప్రోమో వైరల్ అయ్యింది.