గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న అంజలి ఇప్పడు న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. రామ్ చరణ్-శంకర్ కలయికలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కిన గేమ్ చెంజర్ జనవరి 10 సంక్రాంతి స్పెషల్ గా విడుదల కాబోతున్నట్టుగా ఊరించి ఊరించి అనౌన్స్ చేసారు మేకర్స్. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ లో కనిపించబోతున్నారు.
అందులో ఓ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంటే.. మరో హీరోయిన్ గా అంజలి కనిపించనుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, జర్నీ, గీతాంజలి లాంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అంజలి.. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపిస్తుంది. ఒకప్పుడు గ్లామర్ విషయంలో ఆచితూచి అడుగులు వేసిన ఆమె.. కొన్నాళ్లుగా అందాలు చూపించడానికి వెనకడుగు వెయ్యడం లేదు.
తాజాగా అంజలి న్యూయార్క్ వీధుల్లో చిట్టిపొట్టి గౌన్ లో గ్లామర్ షో చేస్తూ ఎంజాయ్ చేస్తూ అందాలు ఆరబోసింది. రెడ్ ఫ్రాక్ లో అంజలి న్యూ గ్లామర్ లుక్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.