హర్ష సాయి కేసులో శేఖర్ బాషా అరెస్ట్ అంటూ గత రాత్రి నుంచి వస్తున్న వార్తలపై శేఖర్ బాషా రియాక్ట్ అయ్యాడు. కొద్దిరోజులుగా రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో రాజ్ తరుణ్ ను సపోర్ట్ చేస్తూ ఛానల్స్ కు ఇంటర్వూస్ ఇచ్చిన శేఖర్ బాషా ఆ తర్వాత బిగ్ బాస్ షో లో అడుగుపెట్టాడు.
అక్కడ నుంచి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా కు బిడ్డ పుట్టడంతో ఆనందంలో మునిగిపోయాడు. ఈ లోపు యూట్యూబర్ హర్ష సాయి పై ఓ హీరోయిన్ కేసు పెట్టింది. తనని మోసం చేసి రెండు కోట్లు హర్ష సాయి వాడుకున్నాడు, అడిగితే సమాధానం లేదు అంటూ కేసు పెట్టడంతో.. హర్ష సాయి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. హర్ష సాయి అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు.
ఈలోపు శేఖర్ బాషా ఈకేసు విషయమంలో తనని కించపరిచేలా మాట్లాడాడు అంటూ హర్ష సాయి బాధితురాలు శేఖర్ బాషా పై కంప్లైంట్ ఇవ్వడంపై శేఖర్ బాషా ను పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేసి మూడు గంటలు విచారించినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే శేఖర్ బాషా మాత్రం తాను అరెస్ట్ అవ్వలేదు అంటూ ఓ వీడియో విడుదల చేసాడు.
తాను గతరాత్రి గచ్చిబౌలి స్టేడియం లో ప్రో కబడ్డీ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను అని, అక్కడ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది అందుకే ఎవరికీ అందుబాటులో లేను, తన అరెస్ట్ వార్తలన్నీ రూమర్స్ అంటూ శేఖర్ బాషా ఆ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు.