సహజంగానే సౌత్ హీరోయిన్స్ హిందీలోకి వెళ్లి అక్కడ సక్సెస్ అయితే వారిపై ఎంతోకొంత బాలీవుడ్ ప్రముఖుల నుంచి వ్యతిరేఖత ఉంటుంది. అక్కడి హీరోయిన్స్ కోట్లలో పారితోషికాలు తీసుకుంటూ టాప్ పొజిషన్ లో ఉండాలనుకుంటారు. అదే సౌత్ నుంచి కొంతమంది భామలు హిందీలో సినిమాలు చేసి సక్సెస్ అయితే అక్కడ నుంచి వ్యతిరేఖత ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే ఫెయిల్ అయితే బ్యాక్ టు సౌత్ అంటూ వచ్చేస్తారు. ఈమధ్యన రకుల్ ఈ విషయమై హాట్ కామెంట్స్ చేసింది.
తాజాగా సమంత పై నార్త్ లో వ్యతిరేఖత ఉంది అనే విషయాన్ని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇండైరెక్ట్ గా బయట పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సీరీస్ లో సమంత-వరుణ్ ధావన్ కలిసి నటించారు.. నవంబర్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ సమంత తో కలిసి పనిచేయొద్దంటూ తనపై చాలా ప్రెజర్స్ వచ్చినట్లుగా చెప్పడంటూ కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి.
ఈ సీరీస్ ఒప్పుకున్నప్పుడు సమంతతో వర్క్ చెయ్యొద్దు, వేరే బాలీవుడ్ హీరోయిన్ ని పెట్టుకొని చెయ్యి అని బాలీవుడ్ కి చెందిన బిగ్ విగ్స్ చాలా మంది తనకి చెప్పినట్టుగా రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ రివీల్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ లెక్కన సమంత ఎదుగుదలను బాలీవుడ్ లో కొంతమంది భరించలేకపోతున్నట్టుగా దీనిని బట్టి అర్ధమవుతుంది.