Advertisementt

బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా అరెస్ట్

Sat 19th Oct 2024 09:07 AM
shekar basha  బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా అరెస్ట్
Bigg Boss fame Shekar Basha arrested బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా అరెస్ట్
Advertisement
Ads by CJ

ఈ ఏడాది బిగ్ బాస్ లోకి అడుగుపెట్టకముందే రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ హడావిడి చేసిన శేఖర్ బాషా అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ లోకి ఎంటర్ అయిన శేఖర్ బాషా వెళ్లిన రెండో వారమే బయటికి వచ్చాడు. హౌస్ లో ఉండగా అతను భార్య డెలివరీ అవడంతో బేబీ ని చూసేందుకు ఆయన రెండో వారంలోనే బయటికొచ్చేసాడు. 

బిగ్ బాస్ నుంచి బయటికొచ్చిన శేఖర్ బాషా హర్ష సాయి అనే యూట్యూబర్ వివాదంలో చిక్కుకున్నాడు. యూట్యూబర్ హర్షసాయిపై ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను నమ్మించి మోసం చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దానితో సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసులు నమోదు చేశారు. 

పోలీసులు కేసు నమోదు చేసినప్పటినుంచి హర్ష సాయి పరారీలో ఉన్నాడు. హర్షసాయి పోలీస్ ల నుంచి తప్పించుకుని విదేశాలకు వెళ్లాడని తెలియడంతో అతని కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడిదే కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్ కావడం గమనార్హం.

Bigg Boss fame Shekar Basha arrested:

Shekar Basha Arrest In Bigg Boss

Tags:   SHEKAR BASHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ