నిన్నగాక మొన్నొచ్చి పార్టీలో ఎన్నికల సమయంలో తాబేలు, కుందేలు కథ చెప్పి హైలెట్ అయ్యిపోయి ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించబడిన శ్యామలను చూసి వైసీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన శ్రీరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అవడం కాదు రేవెట్టేస్తుంది. సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ కోసం ప్రాణం పెట్టేసిన శ్రీరెడ్డిని వదిలేసి ఎన్నికల్లో కొద్దిగా హడావిడి చేసిన శ్యామలకు అధికార ప్రతినిధి పదవి ఇవ్వడం పట్ల శ్రీరెడ్డికి కడుపు మండిపోతుంది.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాత్రమే కాదు లోకేష్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఇలా టీడీపీ, జనసేననేతలెవ్వరిని వదలని శ్రీరెడ్డి వైసీపీ అందులోను జగన్ పై మాట పడనిచ్చేది కాదు. వైసీపీ కోసం ప్రాణాలిచ్చేంతగా పని చేసిన శ్రీ రెడ్డి కి వైసీపీ పార్టీ మాత్రం అన్యాయం చేసింది. తాజాగా శ్యామల పై శ్రీరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.
అదృష్టం అంటే ఈమెదే.. పార్టీ కోసం ఎలాంటి పని చేయకపోయినా ఆమెని మాత్రం అందలం ఎక్కించారు. జై వైఎస్సార్సీపీ, బెదిరింపులు, తిట్లు ఏమో మాకు పోస్టింగులు, ప్రెస్ మీట్‌లు మూతి వంకర అందగత్తెలకి. పార్టీలోని ఆమెని తెలిసి తీసుకున్నారా, తెలియకనా. మైకులు ఆమె దగ్గరకు వెళ్తున్నాయి. రెడ్ లైట్‌ని తెగ హైలెట్ చేస్తున్నారు. ఇక శని నెత్తి మీద కూర్చున్నట్టే. జస్ట్ వెయిట్ మీకే తెలుస్తుంది.. అంటూ శ్రీ రెడ్డి శ్యామలపై తెగ ఫైర్ అవుతుంది.