కొద్దిరోజులుగా సినిమా షూటింగ్స్ పక్కనపెట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సమంత కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ కి హాజరవుతుంది. ప్రస్తుతం సమంత నటించిన హనీ బన్నీ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో బాగా బిజీగా వుంది. అయితే సిటాడెల్ సిరీస్ తన దగ్గరకొచ్చినప్పుడే తనకు మాయోసైటిస్ వ్యాధి కన్ ఫర్మ్ అయ్యింది.
అప్పుడే రాజ్-అండ్ డీకే తో చెప్పాను, అనారోగ్యం దృష్యా నేను చెయ్యలేను.. బన్నీ పాత్రలో నటించలేను అని. అంతేకాదు ఆ సీరీస్ కోసం ఇంకా ఇద్దరి ముగ్గురు హీరోయిన్ పేర్లు కూడా సూచించాను. కానీ రాజ్-అండ్ డీకే మీరు కోలుకునే వరకు వెయిట్ చేస్తామని చెప్పారు. రాజ్-డీకే తన కోసమే పట్టుబట్టి ఎదురు చూడడం వల్లే ఈ సిరీస్ చేయగలిగానని వాళ్ళు వెయిట్ చేసినందుకు థాంక్స్ చెబుతుంది సమంత.
నేనే బన్నీ పాత్రకు కొంతమంది హీరోయిన్స్ సెట్ అవుతారని చెప్పినా వినకుండా నా హెల్త్ సెట్ అయ్యేవరకు వాళ్ళు వెయిట్ చేసారు.. నాతోనే ఈ పాత్ర చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నా అంటూ సమంత రాజ్-అండ్ డీకే లను పొగిడేసింది.
అంతేకాదు షూటింగ్ పూర్తయ్యేవరకు జాగ్రత్తగా చూసుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లో గాయమైతే దగ్గరుండి చూసుకున్నారంటూ సమంత చెప్పుకొచ్చింది.