డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం లేడీ కొరియోగ్రాఫర్ ను మోసం చేశాడన్న అభియోగాలతో చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్యన కండిషన్ బెయిల్ పై బయటికొచ్చిన జానీ తనకిచ్చిన నేషనల్ అవార్డు ను వెనక్కి తీసుకోవడం తో మళ్లీ జైలుకే వెళ్ళాడు. అయితే జానీ మాస్టర్ పై అభియోగాలు నిర్దారణ కాకుండా అతనికొచ్చిన అవార్డు ను వెనక్కి తీసుకోవడం పై పలువురు కొరియోగ్రాఫర్స్ తమ బాధను బయటపెట్టారు.
తాజాగా జానీ మాస్టర్ దగ్గర రెండేళ్లు పని చేసిన మరో కొరియాగ్రాఫర్ అనీ మాస్టర్ జానీ మాస్టర్ మంచోడు అని సర్టిఫికెట్ ఇవ్వడమే కాదు.. అతను ఏంతో కష్టపడి సాధించుకున్న నేషనల్ అవార్డు ను వెనక్కి తీసుకోవడం బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అవుతూ తాజాగా ఆమె మీడియా ముందు మాట్లాడింది.
జానీ మాస్టర్ అత్యాచారం చేసాడని ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు, అతని దగ్గర రెండేళ్లు వర్క్ చేశాయి, జానీ మాస్టర్ చాలా మంచోడు, జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పండి, ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చెయ్యలేదని ప్రూవ్ అయితే అప్పుడు ఏం చేస్తారు అంటూ అనీ మాస్టర్ మీడియా ముందు జానీ మాస్టర్ కేసు విషయమై స్పందించింది.