నిజమే మహేష్ బాబు ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు. గుంటూరు కారం తర్వాత మహేష్ నెక్స్ట్ చెయ్యబోయే SSMB 29 పాన్ ఇండియా ఫిలిం పై ఎన్నో అంచనాలు, ఎంతో ఆత్రుత ఉంది. రాజమౌళి తమ హీరోను ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఈమధ్యనే విజయేంద్ర ప్రసాద్ గారు మహేష్ కాబట్టే రెండేళ్లుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, అదే వేరే హీరో అయితే అంత టైమే అవసరం లేదు అంటూ చెప్పి ఈ ప్రాజెక్ట్ పై మరింతగా హైప్ క్రియేట్ చేసారు.
ఇక మహేష్ బాబు రాజమౌళి తో చెయ్యబోయే ప్రాజెక్ట్ కోసం స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. హెయిర్ పెంచేసి గెడ్డం పెంచుకుంటూ కొత్త అవతారంలో మహేష్ కనిపించాడు. మహేష్ కొత్త లుక్ ఈమధ్యనే రేవంత్ రెడ్డికి కలిసినప్పుడు రివీల్ అయ్యింది. అయితే రాజమౌళి-మహేష్ కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందో అని ఎదురు చూసి చూసి అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి తయారు చేసారు.
ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ అడ్వెంచర్ స్టోరీ రాస్తున్నట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పడం, మహేష్ కొత్త లుక్ ని కలిపి మహేష్ అభిమానులు మహేష్ ను గుర్రమేక్కించి మరీ స్టైలిష్ గా ఫ్యాన్ మేడ్ పోస్టర్ వేసి SSMb 29 ఆట మొదలైంది.. వేట కొనసాగుతుంది అంటూ దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది చూసిన నెటిజెన్స్ మహేష్ అభిమానులు మామూలోళ్లు కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.