బిగ్ బాస్ సీజన్ 8 లో ఏడో వారం పూర్తవడానికి ఎనిమిదో వారం ఎంటర్ అవడానికి మరో రెండు రోజుల సమయమే ఉంది. వైల్డ్ కార్డు ఎంట్రీస్, ఓల్డ్ కంటెంట్స్ మధ్య హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతుంది. ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఈ వారం ఎలిమినేట్ అవ్వబొయే వారి విషయంలో అందరిలో ఉత్సుకత కనిపిస్తుంది.
గత వారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, గౌతమ్, యష్మి, నబీల్, టేస్టీ తేజా, నాగ మణికంఠలతో కలిపి మొత్తం 9 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యాక మొదటి నుంచి నిఖిల్ ఓటింగ్ లో టాప్ లో ఉంటే.. నబీల్ సెకండ్ పొజిషన్ లో కొనసాగాడు. కానీ ఇప్పుడు నబీల్ నిఖిల్ ను వెనక్కి నెట్టి ఓటింగ్ లో టాప్ 1 పోజొషన్ కి వచ్చేసాడు.
ఆతర్వాత రెండో స్థానంలో నిఖిల్ ఉండగా.. మూడో స్థానంలో నాగమణికంఠ, నాలుగు, ఐదు స్థానాల్లో ప్రేరణ, యష్మిలు నిలుస్తున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గౌతమ్ ఉన్నాడు. ఈ వారం డేంజర్ జోన్ లో పృథ్వీ, హరితేజ, టేస్టీ తేజాలు ఉన్నారు. ఓటింగ్స్ ప్రకారం ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో నిలిచారు. మరి ఈ ఒక్కరోజు లో ఓటింగ్ లో హెచ్చుతగ్గులతో ఎవరు ఎలిమినేషన్ జోన్ లోకి వస్తారో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.