బాలీవుడ్ క్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా కాదు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. హిందీ లోనే కాదు సౌత్ చిత్రాలతోను కియారా అద్వానీ బిజీ బిజీగా కనబడుతుంది. సిద్దార్థ్ మల్హోత్రా తో వివాహం తర్వాత కియారా అద్వానీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
సౌత్ లో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న కియారా అద్వానీ జనవరి 10, 2025 సంక్రాంతికి రామ్ చరణ్ తో కలిసి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోపక్క మరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ వార్ 2 లో హృతిక్ రోషన్ కి జోడిగా చిందులేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ కియారా క్రేజ్ మాములుగా లేదు.
సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో మెట్టెక్కించే కియారా అద్వానీ వైట్ వైబ్స్ ఒన్లీ అంటూ వైట్ డ్రెస్ లో గ్లామర్ షో చేసింది. అలా కియారా అద్వానీని చూడగానే మతిపోగొడుతున్న కియారా లుక్ అని నెటిజెన్స్ అనకుండా ఉండలేరేమో. ప్రస్తుతం ఆమె చార్మింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.