Advertisementt

ఆ విషయంలో పుష్పరాజ్ తికమక

Fri 18th Oct 2024 11:40 AM
pushpa 2  ఆ విషయంలో పుష్పరాజ్ తికమక
Pushpraj is confused about that ఆ విషయంలో పుష్పరాజ్ తికమక
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప ద రూల్ షూటింగ్ చకచకా ముగించేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ లాక్ చెయ్యడం మేకర్స్ దానిని అధికారికంగా ప్రకటించడమూ జరిగిపోయాయి. దానితో అల్లు అభిమానులు ఫుల్ గా రిలాక్సయిపోతున్నారు. కారణం పుష్ప 2 ఖచ్చితంగా డిసెంబర్ 6 నే రిలీజ్ అవుతుంది, అది వాళ్ళ కాన్ఫిడెన్స్. 

అంతా బాగానే జరుగుతుంది, అన్ని అనుకూలంగానే ఉన్నప్పటికీ పుష్ప రాజ్ కి ఓ సమస్య మాత్రం వెంటాడుతోంది. అది పుష్ప పార్ట్ 1 లో ఐటమ్ సాంగ్ బిగ్గెస్ట్ హిట్ అవడంతో పుష్ప 2 ఐటమ్ సాంగ్ విషయంలో సుకుమార్ అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నా ఆ ఐటమ్ సాంగ్ లోకి ఏ హీరోయిన్ ని తీసుకోవాలనే విషయంలో మాత్రం ఇంకా టీమ్ తికమకగానే ఉంది. 

ఊ అంటావా మావా లో సమంత రేంజ్ డాన్స్, అందాల ఆరబోత ఏ హీరోయిన్ చేస్తుందో అలాంటి క్రేజీ హీరోయిన్ కోసం సుక్కు వెయిట్ చేస్తున్నారు. అందులో జాన్వీ క‌పూర్, దీప్తి తిమ్రీ పేర్లు ఎప్పటి నుంచో పరిశీలిస్తున్నా సుకుమార్-అల్లు అర్జున్ మాత్రం వీరిద్దరిలో ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో ఇంకా ఓ డెసిషన్ కి రాలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. న‌వంబ‌రు మొద‌టి వారంలో ఐటెమ్ గీతం చిత్రీక‌ర‌ణ ఉండొచ్చు. 

Pushpraj is confused about that:

Pushpa 2 item song update

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ