పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే అంటే విషయం మాములుగా ఉండదు. ఈ ఏడాది అయితే ప్రభాస్ అభిమానులకు ప్రభాస్ బర్త్ డే చాలా ప్రత్యేకం. ప్రస్తుతం సలార్, కల్కి హిట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరోపక్క ప్రభాస్ ఎలాంటి బ్రేక్ లేకుండా మిగతా సినిమాలను చకచకా పూర్తి చెయ్యడం పై కూడా ఫ్యాన్స్ లో ఆనందానికి అవధులు లేవు.
మరోపక్క ప్రభాస్ బర్త్ డే కి సమయం దగ్గరకొచ్చేసింది. వచ్చే బుధవారం అంటే అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్. ప్రభాస్ బర్త్ డే కి అభిమానుల కోసం ఏకంగా ఆరు స్పెషల్ ట్రీట్స్ రెడీ అవుతున్నాయి. అందులో ప్రభాస్ నటించిన ఆరు సినిమాలు ప్రభాస్ బర్త్ డే రోజుకి రీ రిలీజ్ కి సిద్దమవుతున్నావు.
ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలను మేకర్స్ రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నారు. అంతేకాదు ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల నుంచి కూడా సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి. అందుకే అనేది ప్రభాస్ బర్త్ డే ఈసారి అభిమానులు చాలా స్పెషల్ అని.