ఇంకా తెలుసుకోకపోతే ఎలా జగన్..?
151 అసెంబ్లీ స్థానాల నుంచి 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు వైసీపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఐతే.. ఇంత దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఏ విషయంలో పార్టీపై ప్రజలు ఇంత వ్యతిరేఖంగా ఉన్నారు..? నవరత్నాలు అన్నీ పకడ్బందీగా అమలు చేసినా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది..? ఇవన్నీ కాదు లోపం ఎక్కడుంది..? ఈ ఓటమి స్వయంకృపరాధమా..? లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనేది అధికారం పోయి నాలుగు నెలలు గడిచినా ఇంతవరకూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థం కాకపోవడం.. కనీసం తెలుసుకోలేక పోవడం.. ఆ ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
ఎక్కడున్నావయ్యా..!
ఇప్పటికీ లోటు పాట్లు, ఎక్కడ తేడా కొట్టింది అనేది తెలుసుకోలేక పోగా.. మొత్తం నారా చంద్రబాబే చేశారని చెప్పుకోవడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! సరిగ్గా జగన్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మరి. ఇదిగో నీకు ఇంత.. నీకు ఇంత అని టీడీపీ చేసిన ప్రచారంతో మనకు నష్టం జరిగిందే తప్ప.. మనం ప్రజలలోకి వెళ్ళినప్పుడు వైసీపీ చెడు చేసింది అనే మాట ఏ ఒక్కరి నోటా రాలేదు.. ఐతే ఇవాళ టీడీపీ కార్యకర్తలు, నేతలు కానీ ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు తిరగడం మొదలుపెడితే.. పిల్లలు, తల్లులు, 45 ఏళ్లు నిండిన వాళ్ళు, రైతులు, నిరుద్యోగులు ఇలా అందరూ మా డబ్బులు సంగతి ఏంటి..? సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారు..? అని నిలదీసే పరిస్థితి ఉందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. చూశారుగా.. తాను ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయానని కూడా తెలుసుకోలేక పోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అది కూడా కేవలం చంద్రబాబు ప్రచారం వల్లే మోసపోయామని నాయకులకు జగన్ వివరించడం గమనార్హం. అధినేత మాటలు ఈయన ఎప్పుడు మారతారో.. ఏంటో మరి.
ఇదో కొత్త పథకమా..!
ఇవన్నీ ఒక ఎత్తయితే వైఎస్ జగన్ ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే. గురువారం జరిగిన వైసీపీ వర్క్ షాపులో భాగంగా అధినేత కీలక ప్రసంగం చేయడంతో పాటు.. సూచనలు, సలహాలు చేశారు. సోషల్ మీడియాపై ప్రతి ఒక్కరూ ధ్యాస పెట్టాలి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి లీడర్ వరకూ సోషల్ మీడియా పనితీరుని అర్థం చేసుకోవాలి. మీ పనితీరు ఆధారంగానే రేపొద్దున అధికారంలోకి వస్తే మీ ప్రమోషన్స్ ఉంటాయి. నాయకులు ప్రూవ్ చేసుకోండి.. ప్రమోషన్ కొట్టండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఐతే.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సామాజిక సమీకరణాల పేరుతో పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టిన జగన్.. ఇప్పుడు ఇలా హడావుడి చేయడం గమనార్హం. జిల్లాల నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఎలా ఉన్నాయి అన్నదానిపై పరిశీలన, అవగాహన పెంచుకోండి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశమయ్యే నాటికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. అలానే వాటిపై పర్యవేక్షణ, పరిశీలన చేయండి. ఇలా మనం చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా మనం ఎదుగుతామని జగన్ స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికలపై..!
ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా నేను వెనకాడను.. కానీ.. అబద్ధాలు మాత్రం ఆడలేను. నేను ఈ మాటలు చెబితే ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. అయితే విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం ఉండాలనే ఈ మాట చెబుతున్నాను. జగన్ ఈ మాటలు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ నాయకులు నవ్వుకుంటూ ఉండటం చూడొచ్చు. ఇక ఇదే సమావేశంలో జమిలి ఎన్నికల గురుంచి కూడా ప్రస్తావన వచ్చింది. జమిలి అంటున్నారు.. మనం సన్నద్ధంగా ఉందాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని కమిటీలు కీలకంగా పని చేయాలని నేతలకు సూచించారు. ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదన్న జగన్.. చొరవ తీసుకొని అన్యాయాలను ఎదురించి, బాధితుల పక్షాన నిల్చోవాలని.. విషయంలోనూ స్పందించాలి అన్నారు. చూశారుగా.. ఇదీ జగన్ వర్క్ షాపులో చేసిన హడావుడి.. ఎంత జగన్ విలువలు, విశ్వనీయత అనడం.. నేతలు నవ్వుకోవడం.. చంద్రబాబు హామీల వల్లే వైసీపీ ఓడిపోయిందని చెప్పడంతో అధినేతకు ఇంకా అసలు విషయం అర్థం కాలేదని చెప్పుకోవచ్చు. జగన్ రెడ్డిలో ఎప్పుడు మార్పు వస్తుందో.. ఈ సలహాలు ఇచ్చేవారు, స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఇస్తారో చూడాలి మరి.