నిన్నటివరకు పవన్ కళ్యాణ్ పై ఒంటికాలుపై లేచిన ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో పదే పదే పవన్ ను టార్గెట్ చేసారు. అలాంటి ప్రకాష్ రాజ్ విషయంలో పవన్ ఎలా స్పందిస్తారో అనే విషయంలో అందరూ ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తుంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎదురు బొదురు పడబోతున్నారు.
అది కూడా సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రం రెస్యూమ్ షూట్ కి రెడీ అయ్యింది. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఇకపై OG సెట్స్ లోకి ఎంటర్ కాబోతున్నారు. అదే OG లో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా OG సెట్స్ లోకి రాబోతున్నారు.
సో రాజకీయంగా పవన్ కళ్యాణ్ పై తిరగబడిన ప్రకాష్ రాజ్.. OG సెట్స్ లో పవన్ ను ఎలా ఫేస్ చేస్తారు, రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే అని లైట్ తీసుకుంటారా అనే ఉత్సుకత చాలామందిలో ఉంటే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఏ మొహం పెట్టుకుని పవన్ కు ఎదురు పడుతున్నావ్ ప్రకాష్ రాజ్ అంటూ సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ ను ఏసుకుంటున్నారు.