Advertisementt

దసరా, దివాళి లైట్ అన్నా క్రిస్టమస్ ఏం చేస్తారో..

Thu 17th Oct 2024 04:06 PM
tollywood  దసరా, దివాళి లైట్ అన్నా క్రిస్టమస్ ఏం చేస్తారో..
Dussehra, Diwali light and what to do on Christmas? దసరా, దివాళి లైట్ అన్నా క్రిస్టమస్ ఏం చేస్తారో..
Advertisement
Ads by CJ

ఈ ఏడాది పాన్ ఇండియా ఫిలిమ్స్ అన్ని ఆచి తూచి విడుదలకు రెడీ అవుతున్నాయి. 2024 మొత్తంలో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్ మాత్రమే విడుదలయ్యాయి, అవుతున్నాయి. అందులో ప్రభాస్ కల్కి జూన్ లో వచ్చింది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర రిలీజ్ అయ్యింది, బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత రాబోతున్న మారో పాన్ ఇండియా ఫిలిం పుష్ప 2 డిసెంబర్ లో విడుదలవుతుంది.

ఈ మద్యలో మీడియం బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు చాలా వచ్చాయి. అందులో చాలావరకు ఆడియన్స్ ను అలరించాయి. అయితే ఈ ఏడాది ఎలక్షన్స్ కారణంగా మూడు నెలలు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇష్టపడలేదు ఆ తర్వాత ఆగష్టు 15 స్లాట్ ను రెండుమూడు మీడియం బడ్జెట్ మూవీస్ క్యాష్ చేసుకోవాలనుకున్నా అవి ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. ఇక దసరా ను ఏ తెలుగు స్టార్ హీరో వాడుకోలేదు, దసరా హాలిడేస్ మొత్తం దేవర క్యాష్ చేసుకుంది.

ఇక దివాళి కి ఏయే చిత్రాలు రాబోతున్నాయి అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. కానీ పెద్ద హీరోలెవరు దివాళికి రావట్లేదు. అందులో కోలీవుడ్ కంగువ తప్ప. మీడియం రేంజ్ హీరోలు దివాళికి దిగుతున్నారు. కిరణ్ అబ్బవరం KA, లక్కీ భాస్కర్, అమరన్, జిబ్రా మూవీస్ వస్తున్నాయి.

మరి పుష్ప 2 తర్వాత రావాల్సిన గేమ్ ఛేంజర్ సంక్రాంతికి షిఫ్ట్ అవడంతో ఆ క్రిస్టమస్ బరిని ఏ హీరోలు ముఖ్యంగా నాగ చైతన్య, నితిన్ లు క్యాష్ చేసుకుంటారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అటు కన్నప్ప డిసెంబర్ రిలీజ్ అంటున్నా ఇప్పటివరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. మరి క్రిస్టమస్ హాలిడేస్ ని ఏ హీరో వాడుకుంటాడో అనేది తెలియాల్సి ఉంది. 

Dussehra, Diwali light and what to do on Christmas?:

It remains to be seen which hero will use the Christmas holiday

Tags:   TOLLYWOOD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ