నాగ చైతన్య తండేల్ చిత్రంతో ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాడా అని అక్కినేని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. దూత వెబ్ సీరీస్ సక్సెస్ తరవాత రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ గా ఉన్నాయి. అంతేకాదు అటు చైతు పర్సనల్ లైఫ్ లోను సెటిల్ అవ్వబోతున్నారు.
తాజాగా నాగ చైతన్య తన ఇష్టాలను కొన్ని కారణాల వలన వదులుకున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. నాగ చైతన్యకు కార్ రేస్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. చైతు కార్ గ్యారేజ్ లో ఎన్ని రేస్ కార్స్ ఉంటాయో చెప్పడం కష్టం. అలాంటి చైతు ఇప్పుడు రేస్ కార్ డ్రైవ్ చెయ్యాలంటే చాలా ఆలోచిస్తున్నట్లుగా చెప్పాడు.
సినిమాల్లోకి రాకముందు ఓ స్పోర్ట్స్ కారు కొన్నాను, దానిపై ఎక్కువగా షికార్లు చేసేవాడిని, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆ అలవాటు నెమ్మది నెమ్మదిగా మానుకున్నట్లుగా చైతు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కారణం నన్ను నమ్ముకొని నిర్మాతలు కోట్లరూపాయలు పెట్టుబడిగా పెడుతుంటారు, అలాంటి రేస్ కారు డ్రైవ్ చేసే టైమ్ లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి గురికావల్సి వస్తుందని, అంత స్పీడ్ తో స్పోర్ట్స్ కారు నడపొద్దని ఫ్రెండ్స్ కూడా సూచించడంతో దానికి దూరంగా ఉంటున్నా.
గతంలో తన ఆలోచన ఎప్పుడూ వాటిపైనే ఉండేది. అవంటే అంతిష్టం. కానీ దాని వలన ప్రమాదం జరిగితే అటు లైఫ్ రిస్క్ అవుతుంది, ఇటు తన వలన దర్శకనిర్మాతలు ఇబ్బందిపడతారనే కారణంతో ప్రస్తుతం కారు రేస్ అనే ఆలోచనే తనకు రావడంలేదు. కానీ అప్పుడప్పుడు రేసు కారు నడుపుతున్నానని, అయితే చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా నడుపుతున్నట్లు నాగచైతన్య చెప్పుకొచ్చాడు.