Advertisementt

ప్చ్.. మళ్లీ వైసీపీలోకి బాలినేని..!

Thu 17th Oct 2024 01:29 PM
balineni srinivasa reddy  ప్చ్.. మళ్లీ వైసీపీలోకి బాలినేని..!
Balineni again in YCP..! ప్చ్.. మళ్లీ వైసీపీలోకి బాలినేని..!
Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ వైసీపీలోకి తిరిగి రావాలని భావిస్తున్నారా..? అనవసరంగా జనసేనలో చేరి తప్పు చేశానని.. వైసీపీనే బెటర్ అని ఆయన భావిస్తున్నారా..? సీనియర్ నేత, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనదైన మార్క్ రాజకీయం చేసిన బాలినేనికి జనసేనలో సరైన గౌరవం.. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నారా..? అంటే శ్రీనివాస్ ప్రధాన అనుచరులు, ముఖ్య కార్యకర్తల నుంచి అందుతున్న సమాచారం మేరకు అవుననే అనిపిస్తోంది. ఎందుకీ పరిస్థితి.. నిజంగానే వైసీపీలోకి వచ్చేస్తారా..? ఆయన వస్తానంటే అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో.. ఏంటో..!

ఇదీ అసలు సంగతి..!

బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు.. కుటుంబ సభ్యుడు కూడా..! పైగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కాకలు తీరిన నేత కావడంతో ఇవ్వాల్సిన ప్రాధాన్యత దక్కుతోంది. అది.. నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవులతో పాటు కావాల్సినవి ఇచ్చేసేవారు. ఐతే.. జగన్ తన మంత్రివర్గంలో చోటు ఇచ్చినట్టే ఇచ్చి రెండున్నరేళ్లకే పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. నాడు మొదలైన బాలినేని అసంతృప్తి నెలకు రెండు, మూడు సార్లు ఆలగడం.. తాడేపల్లి ప్యాలస్ వేదికగా పంచాయితీలు, బుజ్జగింపులకే ఏడాది అంతా నడిచింది. ఆఖరికి ఎలాగో అటు వైవీ సుబ్బారెడ్డి.. ఇటు బాలినేని మధ్య కాస్త గ్యాప్ తగ్గడంతో వివాదం సద్దుమణిగింది. ఎన్నికలకు వెళ్లిన బాలినేని ఓటమి పాలవ్వగా.. వైసీపీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఎప్పుడెప్పుడు గోడ దుకుదామా..? అని వేచి చూసిన బాలినేని.. వైసీపీకి బిగ్ ఝలక్ ఇచ్చి జనసేనలో చేరిపోయారు.

ఒకప్పుడు ఇలా..!

వాస్తవానికి.. నేను తోపు దమ్ముంటే ఆపు.. నేనొక బ్రాండ్.. నేను చెప్పిందే వేదం.. చేసేదే శాసనం అన్నట్టుగా ఇన్నాళ్లు బాలినేని వ్యవహరించారు. వైఎస్ జగన్ కూడా చూసీ చూడనట్టుగానే ఉన్నారు. ఐతే.. ఎప్పుడైతే పార్టీకి వ్యతిరేకంగా అడుగులు పడ్డాయో.. మన, తన అని లేకుండానే అధినేత పక్కన పెడుతూ వచ్చారు. సీన్ కట్ చేస్తే రాజీనామా దాకా వెళ్లింది. ఈ క్రమంలోనే.. తాను చేరుతానంటే ఏ పార్టీ అయినా గంతులేసి మరీ తీసుకుంటుందని చంకలు గుద్దుకుని మరీ హడావుడి చేశారు. ముందుగా అనుకున్నట్టుగానే.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. 

అయ్యో ఇలా అయ్యిందేంటి..?

ఐతే.. ఎంట్రీకి ముందున్నట్లు.. ఎంట్రీ ఇచ్చాకే అసలు సీన్‌ కనిపిస్తోందట. ఒంగోలులో మాత్రం బాలినేనితో కలిసి పని చేయటానికి టీడీపీ ససేమిరా అంటోందట. జనసేన నేతల్లోనూ బాలినేని పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశం పైన పార్టీలో రెండు వర్గాలుగా విభేదాలు కనిపిస్తున్నాయి. ఇటు టీడీపీ.. అటు జనసేన నుంచి ఒక్కరంటే ఒక్కరితోనూ సమన్వయం లేకపోవడం, కనీసం కార్యక్రమాలకు ఆహ్వానించడం ఇలాంటివి ఏమీ జరగట్లేదట. దీంతో ఇప్పుడు ఎగ్జిట్‌ అవలేం..అలా అని గ్లాస్‌ పట్టుకుని టీ తాగలేం! అన్నట్లుగా బాలినేని పరిస్థితి మారిపోయిందట. వెళ్లామా.. కండువా కప్పుకున్నామా.. పార్టీలో చేరామా..? అని సోసో అన్నట్లుగా కథ నడిపిస్తున్నారట.

ఎవరు చూసినా..!

బాలినేని రాకను మొదట్నుంచీ జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీలో చేరిన తర్వాత అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ బాలినేని తీరుపై రియాజ్ మద్దతు దారులు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఎందుకంటే ఇదే రియాజ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో ఉన్నంత వరకూ బాలినేని గెలుపు కోసం అన్నీ తానై చూసుకున్నారు. ఐతే.. ఇంత చేసినా శ్రీనివాస్ ఎందుకో రియాజ్ కు సరైన గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అప్పట్లో జనసేన పార్టీలో చేరిన ఆయనకు పవన్ తగిన గుర్తింపు ఇచ్చి జిల్లా అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారు. అలాంటిది ఇప్పుడు బాలినేని పార్టీలోకి వస్తే ఎలా సహకరిస్తారు..?.. ఇక బాలినేనిపై గెలిచిన దామచర్ల జనార్దన్ కూడా అస్సలంటే అసలు సహకరించట్లేదు.. దీనికి తోడు రెండ్రోజులకు ఓ సారి మీడియా ముందుకు వచ్చి నీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తున్నారు కూడా..!

రిటర్న్..!

పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకూ కనీసం ఒక్కటంటే ఒక్క కార్యక్రమంలో బాలినేని పాల్గొనలేదు.. అంతే కాదు ఒక్కసారి స్టేజి పంచుకోలేదు. ఆయన్ను ఎవ్వరూ లెక్కచేయట్లేదు. ఇటు దామచర్ల కానీ.. అటు రియాజ్ కానీ అస్సలంటే అస్సలు లెక్క చేయడం లేదు. దీంతో బాలినేని రాజకీయంగా ఎలా నెట్టుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉండటం ఎందుకు అని తిరిగి సొంత గూటికి వెళ్లాలని బాలినేని భావిస్తున్నారట. ఐతే.. మళ్ళీ వైసీపీలో చేర్చుకోవడానికి వైఎస్ జగన్ సిద్ధంగానే ఉన్నారా..? ఒకవేళ చేర్చుకుంటే పరిస్థితి ఏమిటి..? అన్నది తెలియాల్సి ఉంది.

Balineni again in YCP..!:

Does Balineni Srinivasa Reddy want to return to YCP again?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement