ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ అంటే ఒకప్పుడు అంటే ఓ ఐదారేళ్ళ క్రితం బుల్లితెర ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్. ఆ క్రేజే మల్లెమాల యజమాన్యానికి కాసులు వర్షం కురిపించేది. గురు, శుక్రవారాల్లో జబర్దస్త్ కి షో కు వచ్చే రేటింగ్స్ ఇతర ఏ షోస్ కి వచ్చేది కాదు అంటే నమ్మి తీరాలి. అటు కమెడియన్స్ కూడా కార్లు, బంగళాలు కొనుక్కుని స్థిరపడ్డారు.
కానీ ఓ రెండేళ్లగా జబర్దస్త్ షో వెల వెల బోతుంది. టాప్ కమెడియన్స్ మొత్తం జబర్దస్త్ షో కి దూరమయ్యారు. చాలామంది బిగ్ బాస్ కి వెళ్లి ఆ తర్వాత స్టార్ మా లోనే ఉండిపోయారు. కొంతమంది తిరిగొచ్చినా సరైన కంటెంట్ అలాగే పేరున్న కెమెడియన్స్ లేక ఆ షో చూసే వారు కరువయ్యారు. దానితో టీఆర్పి పడిపోయింది. ఇక గతంలో బిగ్ బాస్ కి వెళ్లిన చలాకి చంటి ప్రస్తుతం జబర్దస్త్ లో కనిపించడం లేదు.
కారణం అడిగితే జబర్దస్త్ నేను మానేయలేదు, జబర్దస్త్ వాళ్ళే మానెయ్యమన్నారు. వాళ్లు వద్దన్నారు, నేను మానేశాను అంతే. అందుకు కారణం వాళ్ళు చెప్పలేదు, వాళ్ళను నేను అడగలేదు. దానికి కారణం ఇగో, పొగరు ఇలా ఎవరు అనుకున్నా నేను మాత్రం ఆత్మాభిమానం అనే చెప్పుకుంటాను. నాకు ఇగో ఎక్కువని పదేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు.. ఎవరి ఈగో వాళ్లకు ఉంటుంది అంటూ చంటి జబర్దస్త్ ఎందుకు మానేశాడో చెప్పుకొచ్చాడు.