రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ లో గాయపడి ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. రకుల్ జిమ్ ప్రమాదం వార్త నిన్న సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది. జిమ్ లో నడుముకు బెల్ట్ పెట్టుకోకుండా ఎక్కువ బరువు ఎత్తే ప్రయత్నంలో రకుల్ నడుము పట్టెయ్యడంతో ప్రస్తుతం ఆమె బెడ్ రెస్ట్ లో ఉంది.
తాజాగా రకుల్ తనకు జిమ్ లో జరిగిన ప్రమాదంపై స్పందిస్తూ తాను తెలివతక్కువ పని చేసినట్లుగా చెప్పుకొచ్చింది. నా శరీరం చెప్పిన మాట వినకుండా బరువు ఎత్తి ఆరు రోజులుగా మంచం పైనే ఉంటున్నాను. నేను కోలుకోవడానికి మరో వారం పడుతుంది. అంతకంటే వేగంగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తాను.
ఇది నా లైఫ్ లో నేను నేర్చుకున్న పాఠం. మీ శరీరం మిక్స్ సంకేతాలిస్తే దాని మాట వినండి నాలా తప్పు చెయ్యొద్దు అంటూ తన తెలివితక్కువపనికి రకుల్ ప్రీత్ తెగ బాధపడిపోతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.