బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తున్న నటీమణులు ఈమధ్యన ఫ్యామిలీ ఆడియన్స్ కే కాదు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉంటున్నారు. కాస్త సెలెబ్రిటీ హోదా వచ్చిన వారంతా యూట్యూబ్ స్టార్ట్ చేసేసి వారు చేసే ప్రతి విషయాన్ని యూట్యూబ్ కి ఎక్కించేస్తున్నారు. కూరగాయలు కొన్నా, చికెన్ కొన్నా, అలాగే వంట చేసినా, బట్టలు కొన్నా ఆ వీడియోస్ అన్ని సెన్సేషనల్ వ్యూస్ రాబడుతున్నాయి.
అలా సీరియల్స్ నుంచే కాక యూట్యూబ్ ద్వారా మరింత దగ్గరవుతున్నారు. బుల్లితెర పై చంద్రముఖి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శ్రీవాణి అంటే తెలియనివారుండరు. ప్రస్తుతం ఈటివి శతమానం భవతి సీరియల్ లో నటిస్తున్న శ్రీవాణి రీసెంట్ గా ప్రమాదానికి గురైంది.
శ్రీవాణి ఆమె భర్త విక్రమాదిత్య, కుమార్తె రాజనందిని లు దసరా హాలిడేస్ లో చీరాల ట్రిప్ ప్లాన్ చేసుకుని రోడ్డుమార్గాన కారులో ప్రయాణిస్తుండగా శ్రీవాణి కారు కి యాక్సిడెంట్ అయ్యి ఆమె చేతికి గాయమవడమే కాకుండా నుదుటున కూడా దెబ్బ తగలడంతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని శ్రీవాణి భర్త యూట్యూబ్ ద్వారా షేర్ చేసాడు.
శ్రీవాణి చేతికి గాయం, తల మీద దెబ్బ తో అలా హాస్పిటల్ బెడ్ మీద పడుండడం చూసిన ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మెసేజ్ లు పెడుతున్నారు.