తెలుగు నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్న ఈషా రెబ్బ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఒకప్పుడు గ్లామర్ షో కి దూరంగా ఉన్న ఈషా రెబ్బ ఈ మధ్యన అందాలు ఆరబోతలో వేరే లెవల్ చూపిస్తుంది.
మోడ్రెన్ అవుట్ ఫిట్స్ అయినా ట్రెడిషనల్ వేర్ అయినా అందాల ఆరబోతలో వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికపుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ షేర్ చేసే ఈషా రెబ్బ తాజాగా వదిలిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. స్టైలిష్ లుక్ లో అలా సెల్ఫీలు దిగుతూ చాలా అద్బుతంగా కనిపించింది. సింపుల్ టీషర్ట్, డెనిమ్ షార్ట్ ధరించి చూడచక్కగా కనిపించింది.
అందానికి అందం, అలాగే ఫిట్ నెస్ కి ఫిట్ నెస్ అనేలా ఈషా రెబ్బ అదిరిపోయే లుక్ తో అలరించింది, ఈషా రెబ్బ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.