Advertisement

రేవంత్ మార్క్ రాజకీయం.. సురేఖ ఔట్!!

Wed 16th Oct 2024 09:54 PM
konda surekha  రేవంత్ మార్క్ రాజకీయం.. సురేఖ ఔట్!!
Revanth Mark politics.. Konda Surekha out!! రేవంత్ మార్క్ రాజకీయం.. సురేఖ ఔట్!!
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయం షురూ చేసినట్టుగా తెలుస్తోంది. అదేదో అంటారే కట్టే విర‌గ‌దు.. పాము చావ‌దు అన్నట్టుగా మంత్రి కొండా సురేఖ పంచాయితీ డీల్ చేద్దామని అనుకున్న సీఎంకు తల నొప్పి మొదలైందట. మాజీ మంత్రి కేటీఆర్, సమంత, అక్కినేని నాగార్జున కుటుంబాలపై సురేఖ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు దేశమంతా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగకుండా సురేఖ వరుసగా వివాదాల్లో మంత్రి హస్తం ఉందని మీడియా. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. కొండాపై నాగార్జున కోర్టుకు వెళ్లి క్రిమినల్ కేసు వేయడం ఒక ఎత్తయితే.. ఈ వ్యాఖ్యలకు సమంత మొదలుకుని టాలీవుడ్ దిగ్గజాలు మొత్తం మంత్రితో పాటు సర్కారుకు దిమ్మ తిరిగేలా ట్వీట్లు వెయ్యడం కాంగ్రెస్ పరువు దేశ వ్యాప్తంగా డ్యామేజ్ అయిందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

ఎన్ని వివాదాలో..!

సురేఖ.. ఆ వెంటనే సమంతకు క్షమాపణ చెబుతూనే కావాలనే నాగార్జున కుటుంబానికి నేనేందుకు క్షమాపణ చెప్పాలి..? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది..? నేను నిజమే మాట్లాడాను అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త పెద్ద రాద్దాంతమే అయ్యింది. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనిపించకపోవడం లేదని.. కేటీఆర్ ఏదో చేశారంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఫ్లెక్సీ విషయంలో రేగిన రచ్చతో పోలీస్ స్టేషన్ వెళ్లి ఆఫీసర్ కుర్చీలో కూర్చొని పోలీసులకే ధమ్కీ ఇవ్వడం.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవుడికి పెట్టే నైవేద్యం ఆపి మరీ సురేఖ, ఆమె కుటుంబం పూజలు చేసుకోవడం ఈ వరుస వివాదాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి.

సొంత వాళ్ళే ఎసరు..!

ప్రత్యర్థుల సంగతి అటుంచితే.. సొంత పార్టీ నేతలే కొండా సురేఖ తీరు నచ్చక కన్నెర్రజేశారు. ఆఖరికి మంత్రి పదవికే కాంగ్రెస్ నేతలు ఎసరు పెట్టారు. ఐతే.. డైరెక్టుగా మంత్రి పదవి నుండి పీకేస్తే.. ఇది ప్రతిపక్షం అకౌంట్ లో ఎక్కడ పడుతుందో అని.. ఇన్ని రోజులుగా సురేఖ విషయంలో అటు ముఖ్యమంత్రి, ఇటు పార్టీ అధ్యక్షుడు మౌనంతో సాగదీస్తూ వచ్చారు. కానీ హైకమాండ్ పెట్టె ఒత్తిడితో చేసేదేమీ లేక.. సురేఖను మంత్రి పదవి నుంచి తీసేసే కార్యక్రమం మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. మంత్రి సురేఖపై లోకల్ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసినట్టుగా సీఎం అండ్ కో డ్రామా ఆడిస్తున్నారట. రేపో మాపో మంత్రివర్గ విస్తరణలో భాగంగా సురేఖను మంత్రి పదవి నుండి తప్పించి వేరే వాళ్లకు కేటాయించే ఆలోచనలో హైకమాండ్ మైండ్‌ను లోకల్ లీడర్లు ఆపరేట్ చేస్తున్నారట. 

ప్లాన్ చూసారా..!

అందుకే ఇక్కడ పంచాయితీ తెగకుండా, దానిని ఢిల్లీ పెద్దల వరకు వెళ్ళేలాగా కూడా సీఎం అండ్ కో ఇలా చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి ముందు.. ఢిల్లీకి వెళ్తూ రేవంత్ రెడ్డితో మంత్రి సురేఖ భేటీ అయ్యారు. దీంతో.. ఇటీవల వరుస వివాదాలతో కొండా సురేఖ సీఎంతో భేటీకి ప్రాధాన్యత లభించిందని తెలుస్తోంది. మంత్రి పదవుల భర్తీ, మార్పులు చేర్పులు నేపథ్యంలో కొండా మంత్రి పదవి ఉంటుందా..? ఊడుతుందా..? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో గట్టిగానే జరుగుతోంది. ఐతే.. కొండా సురేఖను సీఎం గట్టిగానే మందలిచినట్లుగా సమాచారం. ఇలా మందలిస్తూనే.. అటు కథ నడిపిస్తూ తన మార్క్ రాజకీయం రేవంత్ చేస్తున్నారు. చివరికి ఏం తేలుతుంది..? మంత్రి పదవిలో సురేఖ అంటారా..? లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Revanth Mark politics.. Konda Surekha out!!:

Konda Surekha Minister Post Issue

Tags:   KONDA SUREKHA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement