యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం తో దుమ్ము లేపాడు. దేవర చిత్రం పై నెగిటివిటీ చూసాక ఈ చిత్రం ఖచ్చితంగా డిసాస్టర్ లిస్ట్ లోకి చేరిపోతుంది అని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ మొదటి రోజు టాక్ కి రెండో రోజు కలెక్షన్స్ కి సంబంధం లేకుండా దేవర పాన్ ఇండియా బాక్సాఫీసుని చెడుగుడు ఆడేసింది.
కేవలం అభిమానుల వల్లే దేవర అంత పెద్ద హిట్ అయ్యింది అని ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. దేవర సక్సెస్ తర్వాత టీమ్ తో పాటుగా అభిమానులకు శిరసు వంచి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్ ఇకపై వార్ 2 షూటింగ్, అలాగే ప్రశాంత్ నీల్ మూవీస్ సెట్స్ లోకి వెళ్లేందుకు సిద్దమైపోతున్నాడు.
ఆగస్టు లోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పూజా కార్యక్రమాలతో మొదలు కాగా.. నవంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తుంటే.. అటు ఎన్టీఆర్ నవంబర్ నుంచి తాను హిందీకి ఇంట్రడ్యూస్ అవుతున్న వార్ 2 షూటింగ్ లో పాల్గొంటాడు.
వార్ 2 షూట్ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి వచ్చేస్తాడట. సో ఇకపై ఎన్టీఆర్ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటాడని ఆయన ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు.