బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ అలాగే మిగతా పాత కంటెస్టెంట్స్ అంతా కలిసిపోయి గేమ్ ఆడేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అందరూ నామినేషన్స్ కి అర్హులే అంటూ అందులో ఎవరెవరు నామినేషన్స్ లోకి వెళ్లాలనే డెసిషన్ ను హరితేజ, ప్రేరణ లపై పెట్టాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియలో అవినాష్ కి పృథ్వీ మద్యన ఓ రేంజ్ లో రచ్చ జరిగింది.
ఆ తర్వాత గౌతమ్ కూడా రెచ్చిపోయాడు. ఫైనల్ గా అవినాష్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి, నబీల్, టేస్టీ తేజా, నాగ మణికంఠ లు నామినేషన్స్ లోకి రాగా.. అందులో అవినాష్ స్టార్ ను వాడుకుని సేవ్ అయ్యి తన ప్లేస్ లోకి హరితేజ ను నామినేట్ చేసాడు. అలా హరితేజ నామినేషన్స్ లిస్టులోకి వచ్చింది.
అందులో అందరికన్నా ఎక్కువగా నిఖిల్ ఓటింగ్ లో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. నబీల్ రెండోస్థానంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత స్థానాల్లో యష్మీ, నాగమణికంఠ, ప్రేరణ లు ఉండగా.. మిగతా స్థానాల్లో గౌతమ్, పృథ్వీ లు ఉన్నారు. చివరిగా హరితేజ, టేస్టీ తేజాలు డేంజర్ జోన్ లో ఉన్నారు. టేస్టీ తేజ కు అతి తక్కువ ఓట్స్ పడడంతో ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది.