పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ముంబైలోనే ఉంటుంది. సౌత్ కి అంటే హైదరాబాద్ అప్పుడప్పుడు బిజినెస్ పనులపై వచ్చి వెళుతున్న రకుల్ ప్రీత్ సౌత్ లో సినిమాలు చెయ్యడం లేదు. హిందీ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ముంబై లోనే ఉంటున్న రకుల్ అక్కడే నిర్మాత కమ్ నటుడు జాకీ భగ్నానీ ని ప్రేమించి ఈ ఏడాది గోవాలో వివాహం చేసుకుంది.
సినిమా లతో పాటుగా జిమ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయిన రకుల్ ప్రీత్ ఈ ఏడాది ఫుడ్ బిజినెస్ లోకి వచ్చేసింది. అయితే ఎప్పుడు జిమ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే రకుల్ రీసెంట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడినట్లుగా తెలుస్తుంది. జిమ్ లో ఆమె బరువులు ఎత్తుతున్న క్రమంలో ఆమె నడుము భాగానికి ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించినట్లుగా సమాచారం. దానితో రకుల్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ కి బ్రేకిచ్చి బెస్ట్ రెస్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.