Advertisementt

విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ పై క్రేజీ న్యూస్

Wed 16th Oct 2024 10:06 AM
vishwambhara  విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ పై క్రేజీ న్యూస్
Crazy news on the new release date of Vishwambhara విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ అనౌన్సమెంట్ రోజే జనవరి 10 సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే విశ్వంభర షూటింగ్ చేస్తూ వస్తున్నా.. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం చిరు విశ్వంభర మేకర్స్ జనవరి 10 ని గేమ్ ఛేంజర్ కి వదిలేసి.. కొత్త డేట్ కి వెళుతున్నట్టుగా చెప్పారు. 

అది కూడా మార్చిలో విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ ఉంటుందేమో అనేలా కొన్ని ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే తాజాగా చిరు విశ్వంభర మార్చ్ లో కూడా వచ్చే అవకాశం లేదు, అది మే 9న అంటే జగదేక వీరుడు-అతిలోక సుందరి రిలీజ్ రోజు విశ్వంభర ను రిలీజ్ చేస్తే బావుంటుంది అని మేకర్స్ అనుకుంటున్నారట. 

మరి మే 9 న విశ్వంభర రిలీజ్ తేదీ ఉంటుందేమో అప్పుడైతే అది వైజయంతి సెంటిమెంట్ డేట్.. అంతేకాదు మెగాస్టార్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డేట్ కూడా.. అందుకే ఆ తేదీ అయితే సూపర్ గా ఉంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఉత్సాహపడుతున్నారు. 

Crazy news on the new release date of Vishwambhara:

Vishwambhara movie update

Tags:   VISHWAMBHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ