నిన్నటివరకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిసెంబర్ అందులోను క్రిస్టమస్ రిలీజ్ అంటూ చెప్పడంతో.. డిసెంబర్ 20 కి వద్దామనుకున్న నాగ చైతన్య పాన్ ఇండియా ఫిలిం తండేల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు నితిన్ రాబిన్ హుడ్ కి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విడుదల తేదీ క్రిస్టమస్ నుంచి సంక్రాంతి రేస్ లోకి వెళ్ళిపోయింది.
మరి దసరా కు గేమ్ ఛేంజర్ రిలీజ్ తేదీపై అప్ డేట్ రాగానే నాగ చైతన్య-చందు మొండేటి తండేల్ ని డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్ 25 కి కానీ రిలీజ్ తేదీని ప్రకటిస్తారని ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ నిర్మాత అరవింద్ తండేల్ చిత్ర విడుదల తేదీ పై డెసిషన్ తీసుకోలేదు. సడన్ గా తండేల్ 2025 సంక్రాంతికి వస్తోందనే వార్త వైరల్ అయ్యింది.
మరి ఇప్పటికే సంక్రాంతి బరి టైట్ అవుతుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో పాటుగా మరికొన్ని చిత్రాలు లైన్ లోకి రాబోతున్నాయి. మరి ఈ సమయంలో క్రిస్టమస్ లేదా సంక్రాంతికి నాగ చైతన్య తండేల్ ఫిక్స్ చేసి ప్రకటించాలని అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.