అవును.. ఈ మాట అన్నది మరెవరో కాదు.. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే..! తెలంగాణాకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి. ఇప్పుడీ కామెంట్స్ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో.. ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారే.. ఎప్పుడేం మాట్లాడుతారో..? ఎందుకు మాట్లాడుతారో..? అర్థం కాదంటూ సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకూ కన్నెర్రజేస్తున్నారు. ఇంకొందరు ఐతే.. మతి ఉండే ఇలాంటి మాటలు మాట్లాడుతారా..? అంటూ కన్నర్ర జేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఎమ్మెల్యే ఇలా అన్నారు..? ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది..? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
ఇదీ అసలు సంగతి..
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసం చేసిన ఘటన ఎంత వివాదాస్పదం అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ Vs బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలుగా పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పందిస్తూ.. హిందువులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిగ్గు, శరం లేని హిందువుల జాతి హైదరాబాద్‌లో పడి ఉందన్నారు. సిగ్గు, శరం, రక్తం ఈ కొడుకులకు ఎప్పుడు మరుగతదో..? రక్తం మరిగినప్పుడు ఈ సంఘటనలన్నీ తగ్గుతాయంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అంతటితో ఆగలేదు.. హిందువులు పిచ్చోళ్లు.. హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులు. హిందువుల్లో మగతనం చచ్చిపోయింది. మసీదులు, దర్గాల మీద దాడులు చేసేందుకు ఒక్క హిందువుకు కూడా ధైర్యం సరిపోవట్లేదా..? ఏ హిందూ పిచ్చోడు కూడా మసీదు మీదకు పోతలేడు.. దాడులకు పాల్పడ్డ వారిని పిచ్చోళ్లు అని పోలీసులు వెనుకేసుకు వస్తున్నారు. ఈ దాడుల వెనుకాల ప్రభుత్వమే ఉంది.. దాడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
అవసరమా..?
చూశారుగా.. ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఎలాంటి మాటలు మాట్లాడారో..? ఐనా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కనీసం ఇంకిత జ్ఞానం ఉంటుందో.. లేదో చూడండి అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఐనా హిందువులను కొడుకులు, నా కొడుకులు అని సంబోధించడం ఎంత సిగ్గు చేటు అంటూ కన్నెర్రజేస్తున్నారు. పోనీ.. ఈయన మాటలతో హిందువులు సీరియస్ గా తీసుకుని మసీదులు మీద దాడి చేస్తే నష్టం ఎవరికి..? కేసులు, కోర్టులు అంటూ తిర్గాల్సింది ఎవ్వరు..? ఎందుకీ మతాల మధ్య చిచ్చు..? అసలు తమరు సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు..? విగ్రహం ధ్వంసం చేసింది ఎవరు అన్నది తెలుసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాలే తప్ప.. హిందువులను రెచ్చగొట్టి మసీదులపై దాడి చేయమని చెప్పడం ఎంతవరకూ సబబు అనేది ఎమ్మెల్యే మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యవహారంపై మజ్లిస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.