బిగ్ బాస్ సీజన్ 8 ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి ఎంటర్ అయ్యింది.. హౌస్ మొత్తం వైల్డ్ కార్డు ఎంట్రీస్, పాత కంటెస్టెంట్స్ తో హౌస్ మొత్తం హడావిడిగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ వాడి వేడిగా జరిగింది.
ఈ వారం హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి, నబీల్, టేస్టీ తేజ, నాగ మణికంఠ లు నామినేషన్స్ లోకి వచ్చినట్టుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ కూడా పూర్తయితే ఎవరు నామినేషన్స్ లోకి వచ్చారో అనేది క్లియర్ అవుతుంది. కానీ లీకులు ముందే ఆ పేర్లు బయట పెట్టేస్తున్నాయి.
అయితే ఇప్పటికే పోల్స్ మొదలెట్టేయ్యగా అందులో నిఖిల్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. మొదటి నుంచి ఫిజికల్ టాస్క్ లలో స్ట్రాంగ్ గా కనిపిస్తున్న నిఖిల్ పై బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ బావుంది. మరోపక్క నబీల్ కూడా నిఖిల్ కి ఓటింగ్ లో గట్టి పోటీ ఇస్తున్నాడు. ఆ తర్వాత యష్మి, నాగమణికంఠ వరస స్థానాల్లో ఉన్నారు. ఆ తరవాత స్థానాల్లో ప్రేరణ, గౌతమ్, పృథ్వీ లు ఉన్నారు. ఈసారి డేంజర్ జోన్ లో పృథ్వీ కనిపిస్తున్నాడు. గత వారం సీత ఎలిమినేట్ అయితే ఈవారం పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.