పుష్ప పార్ట్ 1తో నార్త్ ఆడియన్స్ కు బాగా దగ్గరైన అల్లు అర్జున్ ఆ చిత్రం తో ఎలాంటి అంచనాలు లేకుండా నార్త్ లో 100 కోట్లు కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. అప్పటినుంచి అల్లు అర్జున్ బాలీవుడ్ లో అల్లు అర్జున్ స్పెషల్ పిఆర్ టీం ని నడిపిస్తున్నాడు, ముంబై వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా బాలీవుడ్ మీడియా స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది అంటూ చాలామంది మాట్లాడారు.
అందుకే పుష్ప 2 విషయంలో సుకుమార్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సౌత్ అండ్ నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 లో ఏ సీన్ నచ్చకపోయినా పదే పదే రీ షూట్స్ చేస్తూ తెగ చెక్కేస్తున్నారు. పుష్ప ఆల్బమ్ దగ్గర నుంచి కథ వరకు, అల్లు అర్జున్ యాక్టింగ్ దగ్గర నుంచి సుకుమార్ మేకింగ్ వరకు అన్నిటిని హిందీ ఆడియన్స్ ఇష్టపడ్డారు. కాబట్టే బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నాడు.
డిసెంబర్ 6 న విడుదల కాబోతున్న పుష్ప ద రూల్ విషయంలో అల్లు అర్జున్ అండ్ టీమ్ స్పెషల్ గా ముంబైలో స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 5 మిడ్ నైట్ బాలీవుడ్ సెలెబ్రిటీస్ అందరిని పిలిచి స్పెషల్ ప్రిమియర్ వేయబోతున్నారట. సెలబ్రిటీస్ తో పాటుగా అక్కడి మీడియాకి కూడా పుష్ప ద రూల్ స్పెషల్ ప్రీమియర్ వెయ్యడానికి ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. అలా అయితే సెలబ్రిటీస్ ఒపీనియన్ తో సోషల్ మీడియా ద్వారా పుష్ప 2 కు ప్లస్ అవ్వొచ్చని సుక్కు అండ్ అల్లు అర్జున్ లు ఇలా ప్లాన్ చేస్తున్నారెమో.