కన్నడ హీరో దర్శన్ కు కోర్టు బెయిల్ ఇచ్చే విషయంలో ఎన్నోసార్లు నిరాకరిస్తూ వస్తుంది. అభిమాని హత్య కేసులో దర్శన్ తో పాటుగా ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ తో సహా మరో 15 మంది జైల్లోనే మగ్గుతున్నారు. దర్శన్ ఆయన బ్యాచ్ పదే పదే బెయిల్ కోసం అప్లై చేస్తున్నా కోర్టు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోకుండా వరసగా షాకిస్తుంది.
తాజాగా దర్శన్ అలాగే పవిత్ర ల బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వెయ్యడం తో దర్శన్ ఇంకా మిగతా వారు ఆయన అభిమానులు నిరాశలో కూరుకుపోతే.. ఈ కేసులో దర్శన్ అండ్ బ్యాచ్ ఇకపై జైలులోనే ఉంటారేమో ఇన్ని నెలలుగా రాని బెయిల్ ఇకపై వస్తుంది అనే నమ్మకం లేదు అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
దర్శన్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వ తరుపు లాయర్, దర్శన్ లాయర్ వాదనలు కొద్దిరోజులుగా వింటున్న కోర్టు వీరికి బెయిల్ ఇవ్వరాదని తీర్పు వెలువరించడంతో దర్శన్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.