బలగం చిత్రం తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు యెల్దండి బలగం చిత్రం తర్వాత హీరో నాని తో సినిమా అనౌన్స్ చేసి అప్పుడే ఏడాదిపైనే అయ్యింది. బలగం తర్వాత వేణు తన తదుపరి మూవీ స్క్రిప్ట్ పైనే కూర్చున్నాడు. నాని-వేణు ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లబోతుంది అనుకున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే టాక్ మొదలయ్యింది.
నాని సరిపోదా శనివారం చిత్రం సక్సెస్ తర్వాత సుజిత్ మూవీ అలాగే వేణు మూవీ సెట్స్ లోకి వెళ్తాడా అనుకుంటే నాని అటు హిట్ 3 షూటింగ్ ఇటు దసరా దర్శకుడితో సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. దానితో వేణు ఇతర హీరోలకు తన యల్లమ్మ కథ వినిపించినా ఫైనల్ గా నాని తో చెయ్యాల్సిన ప్రాజెక్ట్ నితిన్ చేతికి వెళ్ళింది అంటున్నారు.
నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చెసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రాలు అతి త్వరలోనే రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించనున్నారు. ఆ తర్వాత నితిన్ వేణు యల్లమ్మ ప్రాజెక్ట్ చేసే అవకాసం ఉన్నట్లుగా తెలుస్తోంది.