అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో మూడేళ్ళ క్రితమే వచ్చిన పుష్ప చిత్రం పాన్ ఇండియా మర్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ గా పుష్ప ద రూల్ చిత్రం డిసెంబర్ 6 న విడుదలకు రెడీ అవుతుంది. చక చకా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న పుష్ప 2 చిత్రానికి సంబంధించి ఫస్ట్ హాఫ్ లాక్ చేసినట్లుగా మేకర్స్ ఈ మధ్యనే ఇచ్చారు.
ఇప్పుడు పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చేసిన కామెంట్స్ క్రేజీగా వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఓ ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న దేవిశ్రీ పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూడగానే మైండ్ బ్లాక్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని సీన్స్ కు నేను, చంద్రబోస్ గారు క్లాప్స్ కొట్టేశాం. సినిమాలోని ఒక్కో సీన్ ఇంటర్వెల్ ఎపిసోడ్ లా ఉండబోతుంది, అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ మేకింగ్ స్టైల్ మళ్లీ మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ దేవిశ్రీ పుష్ప ఫస్ట్ హాఫ్ పై చేసిన కామెంట్స్ అల్లు ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే చేసింది.
మరి డిసెంబర్ 6 న ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని అల్లు అర్జున్ పుష్ప 2 తో చెరిపేసి కొత్త రికార్డ్స్ సృషించడం ఖాయమంటూ అల్లు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.