సెప్టెంబర్ 27 న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. విడుదలైన రోజు దేవర కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండో రోజు నుంచి దేవర కు మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి మెల్లగా కలెక్షన్స్ పికప్ అయ్యాయి. అలా 15 రోజుల్లో 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది దేవర.
దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఐదారుసార్లు వీక్షించడమే దేవర కు బాగా ప్లస్ అయ్యింది. ఇప్పటికి దేవర కు వెళదామా అనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చూస్తే ఎన్టీఆర్ చెప్పడం కాదు నిజంగా ఎన్టీఆర్ ను ఆయన ఫ్యాన్స్ అడ్డం పడి మరీ ఆదుకున్నారు. దేవర విడుదలై మూడు వారాలు అవడంతో.. ఇప్పుడు దేవర ఓటీటీ డేట్ పై అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.
దేవర చిత్ర డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ పాన్ ఇండియా భాషలన్నిటిని క్రేజీ డీల్ తో దక్కించుకుంది. దానితో నెట్ ఫ్లిక్స్ నుంచి దేవర చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వదులుతారా అనే ఆత్రుత అభిమానుల్లో మొదలయ్యింది. అయితే థియేటర్స్ లో విడుదలైన ఆరువారాల తర్వాత దేవర ని స్ట్రీమింగ్ చేసేలా నెట్ ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకోవడంతో దేవర చిత్రం నవంబర్ ఫస్ట్ వీక్ వరకు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.