పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇపుడు కాదు ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. రాజకీయాల విషయంలోనే కాదు, మొన్నామధ్యన పుష్ప అంటూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేస్తారు ఒకరు అంటూ ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసాయి.
రాజకీయాల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చెయ్యలేదని అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టిపోశారు. తాజాగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మాత్రమే కాదు తెలుగు స్టార్ హీరోలందరిపై చేసిన క్రేజీ కామెంట్స్ వైరల్ అయ్యాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ని చూడగానే అభిమానులు, పార్టీ నాయకులు.. ఓజీ.. ఓజీ అంటూ అరిచారు.
ఇన్ని రోజులు కూడా మీరు ఓజీ.. ఓజీ.. అంటుంటే నాకు మోదీ.. మోదీ అని వినిపించేది, ఎంటర్టైన్మెంట్ అందరికీ కావాల్సిందేనని, అందరూ తమ ఫేవరేట్ హీరోల సినిమాలకు వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా.. అందుకే ముందు కడుపు నింపే పని చేద్దామని పవన్ పిలుపునిచ్చారు. రోడ్లు, స్కూల్స్ ను బాగు చేసుకుందామని చెప్పారు.
మీ ఫేవరేట్ హీరోలు మీకు ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం, సినీ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోలతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ముఖ్యంగా సినిమాల పరంగా.. తాను ఎవరితో కూడా పోటీ పడనని, చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ఎక్సపెర్ట్, చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాని.. అలా అందరూ బాగుండాలని ఎప్పుడూ తాను కోరుకుంటానని తెలిపారు పవన్.
మరి పవన్ నోటి వెంట అల్లు అర్జున్ పేరు విన్నాక అల్లు అర్జున్ ఫ్యాన్స్ శాంతిస్తారో.. లేదంటే డిప్యూటీ సీఎం పవన్ పై ఇంకా ఇంకా కత్తి కడతారో చూడాలి.