క్యూట్ బ్యూటీ శ్రీలీల ఈమధ్యన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రకరకాల ఫొటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. క్యూట్ అండ్ స్వీట్ అవుట్ ఫిట్స్ అలాగే మోడ్రెన్ వేర్, ట్రెడిషనల్ డ్రెస్సులతో శ్రీలీల ఎప్పటికప్పుడు న్యూ లుక్ తో అభిమానులను పలకరిస్తుంది.
ఈమధ్యన సినిమా షూటింగ్స్ తో బాగా బిజీ అయిన శ్రీలీల హిందీలో కాలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. శ్రీలీల మంచి డాన్సర్. అంటే అందమైన గ్లామర్ షో. అయినప్పటికీ శ్రీలీల ఎక్స్ పోజింగ్ మాత్రం ఎక్కడా ఎబ్బెట్టుగా ఉండదు. శ్రీలీల తాజాగా షేర్ చేసిన ఫొటోలలో ఆమె అందం మరింతగా హైలెట్ అయ్యింది.
నేచర్ బ్యూటీ శ్రీలీల వేసిన డిజైనర్ గౌన్, కాన్ఫిడెన్స్ తో కూడిన పోజులకు యూత్ ఫిదా అవ్వాల్సిందే. ఎర్త్‌టోన్ గౌన్ సహజ సుందరత్వానికి మెరుగులు అద్దింది. శ్రీలీల కొత్త లుక్ మాత్రం అభిమానులనే కాదు అందరిని మైమరపించింది.