కోనేటి ఆదిమూలం.. పేరు చూశారా ఎంత మంచిగా, గొప్పగా ఉందో కదా..! ఐతే పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా పరిస్థితి ఉంది..! ఈయన సత్యవేడు ఎమ్మెల్యే.. అంటే ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి. ఓటేసి గెలిపించిన ప్రజలకు సేవ చేయాల్సిన ఆదిమూలం పెద్ద ఆటగాడిలా మారిపోయారు..! ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని మహిళలతో వికృత చేష్టలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి ఆడియో, వీడియోలను రిలీజ్ చేయడంతో రచ్చ రచ్చే అయ్యింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ గంటల వ్యవధిలోనే పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఐతే.. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళడం మళ్ళీ బాధితురాలు - ఎమ్మెల్యే ఇద్దరూ రాజీకి రావడం వివాదం సద్దుమణిగింది. ఐతే.. ఇప్పుడిప్పుడే ఆయన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్న తరుణంలో.. ఊహించని ఝలక్ ఇచ్చారు ఆదిమూలం.
మారవా.. నువ్ మారవా!
ఒకసారి చేస్తే అది తప్పో ఒప్పో అనుకోవచ్చు. కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని కామం అనక మరేమంటారు..? చెప్పండి. ఇదివరకు జరిగిన ఘటనతో ఓటేసి గెలిపించిన ప్రజల్లో పరువు పోయింది.. దీనికి తోడు ఫ్యామిలీని రోడ్డుకు ఈడ్చినట్టు అయ్యింది. ఐతే ఇంత జరిగినా ఆ ఎమ్మెల్యేకు మాత్రం బుద్ధి రాలేదు.. సిగ్గు ఎగ్గు లేకుండా మరో మహిళతో రాసలీలలకు సంబంధించిన ఆడియో టేప్ బయటికి వచ్చింది. బాబోయ్ ఆ ఆడియో వింటే కామం మొత్తం అందులో చూపించేసారు ఎమ్మెల్యే. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలు సైతం తిట్టి పోస్తున్నారు. మారవా.. నువ్వు మారవా అంటూ మిర్చి డైలాగుతో నెటిజన్లు రచ్చ రచ్చే చేస్తున్నారు.
ఇంకెన్నాళ్ళు..!
ఆ ఆడియోలో మహిళను వర్ణించిన తీరు.. ఆ మాటలు.. రిప్లై వస్తున్న మాటలను బట్టి చూస్తే ఎమ్మెల్యే ఇంత కామాంధుడు ఏంట్రా బాబోయ్ అని అనకుండా ఉండలేరు. నియోజవర్గంలో నాలుగు మంచి పనులు చేయండని ప్రజలను ఆయన్ను ఎమ్మెల్యేను చేస్తే.. ఆదిమూలం మాత్రం రాసలీలలతో బిజిబిజీగా ఉండటం ఎంత వరకూ సమంజసం. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లిందా..? లేదా అన్నది తెలియట్లేదు. ఐతే.. ఆదిమూలంపై ఈసారి టీడీపీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది..? అసలు పార్టీలో చోటు ఇస్తుందా..? లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే అవకాశం ఏమైనా ఉందా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఐతే.. ఈసారి మాత్రం ఎమ్మెల్యే గట్టెక్కడం కష్టమే అని మాత్రం టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.