Advertisementt

ఆ గాడిదను పంపేశారు

Tue 22nd Oct 2024 01:34 PM
donkey,bigg boss 18,salman khan,peta  ఆ గాడిదను పంపేశారు
Donkey Out From Hindi Bigg Boss 18 ఆ గాడిదను పంపేశారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ రియాలిటీ షో ఎన్ని భాషలలో వచ్చినప్పటికీ హిందీ బిగ్ బాస్‌కు ఉన్న క్రేజే వేరు. హిందీ బిగ్ బాస్ హోస్ట్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి ఇచ్చే రెమ్యునరేషన్‌తో.. మిగతా అన్ని భాషలలో బిగ్ బాస్ హౌస్‌ని నడపవచ్చంటే.. హిందీలో ఈ షో క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 రీసెంట్‌గానే మొదలైంది. అయితే ఈసారి బిగ్ బాస్ యాజమాన్యం క్రేజీగా ఆలోచించారు. మనుషులతో పాటు ఓ జంతువును కూడా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి పంపారు. ఆ జంతువు ఏదో కాదు.. గాడిద. 

అయితే ఆ గాడిదను ఇప్పుడు హౌస్‌ నుండి పంపించేశారు. ఏ.. ఎందుకు పంపించేశారు. ఎలిమినేషన్ లిస్ట్‌లో నామినేట్ అయ్యిందా? టాస్క్‌లు సరిగా ఆడలేదా? లేక ఓట్లు తక్కువగా వచ్చాయా? అసలెందుకు గాడిదను పంపించేశారు? అని బిగ్ బాస్ చూసే వారెవరికైనా డౌట్స్ రావడం సహజం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. అసలు విషయం ఏమిటంటే..

ఇక్కడ యానిమల్ యాక్ట్ గట్టిగా పనిచేసింది. పెటా ఇండియా రంగంలోకి దిగి బిగ్ బాస్ యాజమాన్యానికి, అలాగే హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు వెంటనే గాడిదను తమకు అప్పగించాలని లేఖ రాసింది. ప్రతి సినిమాలో జంతువులకు హాని కలిగించలేదంటూ సినిమా వాళ్లే బోర్డ్ వేస్తుంటే.. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిదను తెచ్చి.. దానిని గద్ రాజ్ అని పిలుస్తూ.. దానిపై వినోదాన్ని వెతుక్కోవడం ఏమిటి? అంటూ పెటా నుండే కాకుండా సామాన్య జనం నుంచి కూడా ఈ చర్యపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

దీంతో బిగ్ బాస్ యాజమాన్యం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ గాడిదను బిగ్ బాస్ హౌస్ నుండి పంపించేశారు. గాడిదను పంపించేస్తూ.. స్టేజ్‌పై సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. గద్ రాజ్ ఒకవేళ నువ్వు గెలిస్తే .. నిన్ను ఎలా ఎత్తుకోవాలి.. నీ చెవులను పట్టుకుని ఎత్తుకుంటాలే.. అంటూ సల్మాన్ గాడిదతో మాట్లాడారు. ఇక బిగ్ బాస్ ‌నుంచి గాడిదను పంపించేశారు కాబట్టి.. ఇంతటితో వివాదం సద్దుమణిగిందనే చెప్పుకోవాలి. అయితేనేం గాడిద రూపంలో ఈ షోకు రావాల్సిన మైలేజ్ వచ్చేసిందిగా.. అంటూ కొందరు కామెంట్స్ చేయడం విశేషం.  

Donkey Out From Hindi Bigg Boss 18:

Peta Request to Bigg Boss 18 For Donkey

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ