కెరీర్‌లో ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నానని అన్నారు బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం పెళ్లి చేసుకుని, సినిమాలకు, టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌కు దూరంగా ఉండటం కాదు.. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు లేవు. అందుకే ఇతర వుడ్స్‌లో ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రభాస్ సినిమాలో తనని తీసేసి.. కాజల్‌ని పెట్టుకున్నారట. అసలు మ్యాటర్ ఏంటంటే..
ప్రభాస్‌తో ఓ సినిమాకు నన్ను ఫైనల్ చేసి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అప్పుడు నేను చదువుకుంటున్నాను. షెడ్యూల్ పూర్తయిన తర్వాత చదువు నిమిత్తం నేను ఢిల్లీ వెళ్లాను. ఆ తర్వాత షెడ్యూల్‌కు నాకు కాల్ రాలేదు. ఆ తర్వాత అడిగితే.. వేరే హీరోయిన్‌ని తీసుకున్నారని తెలిసింది. చాలా ఫీలయ్యాను. అయితే నాకు అసలు చెప్పకుండా, వేరే హీరోయిన్‌ని తీసుకోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు. కాజల్ అగర్వాల్. ప్రభాస్, కాజల్ కాంబినేషన్‌లో అంతకు ముందు వచ్చిన చిత్రం మంచి హిట్ అయిందట. అందుకని నేను చేయాల్సిన పాత్ర నుండి నన్ను తొలగించి కాజల్‌కు ఆ అవకాశం ఇచ్చారు. ఇలాంటి అవమానాలు కెరీర్ స్టార్టింగ్‌లో చాలానే చూశానంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
రకుల్ ఇచ్చిన ఈ సమాచారంతో ప్రభాస్, కాజల్‌ల ఆ సినిమా ఏమై ఉంటుందా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. మిస్టర్ పర్ఫెక్ట్. అంతకు ముందు ప్రభాస్, కాజల్ కాంబోలో వచ్చిన చిత్రం డార్లింగ్. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా.. ప్రభాస్‌కు డార్లింగ్ అనే గుర్తింపుని స్థిరం చేసింది. డార్లింగ్ తర్వాత ఈ కాంబోలో వచ్చిన చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. నిజంగా ఈ సినిమాలో కాజల్ చాలా చక్కగా సరిపోయింది. ఆ పాత్రలో ఇప్పుడు చెబుతున్న రకుల్‌ని ఊహించుకుంటే.. ఏమంత గొప్పగా ఉండేది కాదు. కాబట్టి మేకర్స్ ఛాయిస్ కరెక్ట్ అనే చెప్పుకోవాలి. కాకపోతే.. రకుల్‌కి ఓ మాట చెప్పి ఉంటే బాగుండేది.